'ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో!'
తన అడవిలోకి ప్రవేశించవద్దని ఘటోత్కచుడు ఎదురుగా ఉన్న అభిమన్యుడిని వారించాడు. 'నీవంటి రాక్షసాధములు ఎంత మంది కలసి వచ్చినా ఈ నా బాణానికి సరితూగరు. నీవా నాకు భయాన్ని నేర్పించునది. నేను ఇచ్చటి నుండి ముందరకే పొయెదను.'
'మూర్ఖుడా ! ఇది అరణ్యం. మా అరణ్యము. ఈ మార్గాన రాక్షసులు తప్ప మరెవ్వరూ ప్రవేశించ సాహసించరు. ఇకనైనా నీ ప్రేలాపనలు చాలించి వెనక్కి పొమ్ము.'తగదు.'
అభిమన్యుడి తల్లి సుభద్ర ఒక్క క్షణం మాట్లాడొద్దని బిడ్డని వారించింది. 'నాయనా అభిమన్యు! ఇది రాత్రి. రాత్రి పూట రాక్షసులతో యుద్ధము అస్సలు
అభిమన్యుడు ఆమె మాటలు పట్టించుకోకుండా అతనితో తగవు పెట్టుకున్నాడు. ఇదంతా చూస్తున్న ఐదేళ్ల పిల్లవాడు ఒకడు వాళ్ళ అమ్మని వరసపెట్టి ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు. అది ఆదిలాబాద్ జిల్లా, మహారాష్ట్ర బోర్డర్ దగ్గర ఒక కుగ్రామం. అక్కడ జాతర సందర్భంగా ఒక చిన్న పౌరాణిక నాటకం ప్రదర్శిస్తున్నారు. అందరూ నాటకంలో లీనమైపోయి చూస్తున్నారు.
'అమ్మా! రాత్రి పూట రాక్షసులతో యుద్ధం ఎందుకు చెయ్యకూడదు అమ్మా?”అని అమాయకంగా అడిగాడు ఆ నాటకం చూస్తున్న పిల్లవాడు.
'రాత్రయితే, రాక్షసుల బలం వెయ్యి రెట్లు పెరుగుతుంది నాన్నా. అందుకే ఆ సమయంలో మనం వారితో యుద్ధం చెయ్యకూడదు అన్నమాట' అని సమాధానం ఇచ్చింది. 'ఓహో! రాత్రిపూట రాక్షసులు ఎక్కువ బలం ఉంటుంది అనమాట' అన్నాడా పిల్లవాడు.................