మీకు ఒకే ఒక ఆదాయం ఉంటే మీరు పేదవారు
ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికశాస్త్ర నిపుణులు చెప్పిన ముఖ్యమైన అంశాలలో మొదటిది.
“ఒకే ఒక ఆదాయ మార్గం ఉంటే మనం ఆర్థిక స్వేచ్ఛను పొందలేము”
ఒక వ్యక్తి కేవలం ఒకే ఒక ఆదాయం మీద ఆధారపడటం వల్లనే అనేక రకాల ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటాడు.
అందుకే రకరకాల ఆదాయ మార్గాల్ని అన్వేషించాల్సి ఉంటుంది.
Single source of Income
ఒక వ్యక్తి ఉద్యోగం ద్వారా గాని, వ్యాపారం ద్వారా గాని ఒక ఆదాయాన్ని పొందుతూ ఉంటే దాన్ని 'ఒకే ఒక ఆదాయ మార్గం' (single source of income) అంటారు.
Multiple Sources of Income
ఒక వ్యక్తికి అనేక రకాల ఆదాయ మార్గాలు ఉండడం. అంటే తాను చేస్తున్న ఉద్యోగం లేదా వ్యాపారంతో పాటు వ్యవసాయ ఆదాయం, ఇంటి కిరాయిలు, పెట్టుబడుల ద్వారా వస్తున్న ఆదాయం, సైడ్ బిజినెస్, online ద్వారా ఆదాయం లాంటివి.
అయితే అక్రమంగా సంపాదించే డబ్బు (లంచాలు, మోసాలు, బ్లాక్ మెయిలింగ్, బ్లాక్ మార్కెట్, కల్తీ వ్యాపారం, అక్రమ మద్యం, వ్యభిచారం లాంటివి) ఈ కోవలోకి రావు.
ఎందుకంటే అటువంటి డబ్బు ఎలా వస్తుందో, ఎంత త్వరగా వస్తుందో, అలాగే పోతూ, మనశ్శాంతిని కూడా తీసుకెళ్తుంది................