విజ్ఞానము-దర్శనం-ధర్మం
జ్ఞానంలో మూడు స్థితులుంటాయి. పంచేంద్రియాలతో మనం పొందే జ్ఞానాన్ని సైన్స్ అంటాం. పంచేంద్రియాల ద్వారా పొందేటటువంటి జ్ఞానము రూపములో ఆధ్యాత్మికతను మీరు చెప్పాలి. మీకు నమ్మకం ఉంటే వస్తుంది, సాధన చేసుకుంటే వస్తుంది, పూర్వజన్మ సుకృతం ఉంటే వస్తుంది అనే మాటలు ఇక్కడ పనికిరావు. అదీ వైజ్ఞానిక దృష్టి కోణం అంటే, చేస్తే తప్పకుండా వస్తుంది. పూర్వజన్మ సుకృతం ఉందో లేదో మనకనవసరం. స్విచ్ వేసినా లైట్ వెలగకపోతే కరెంటు లేదని అర్ధం కాని పూర్వజన్మ సుకృతం లేదని కాదు. పూర్వజన్మ సుకృతానికి దానికి సంబంధం ఏమీ లేదక్కడ. ఒకవేళ కరెంటు లేకపోతే కరెంటుకి కావలసిన ప్రత్యామ్నాయాలు మనం చూసుకోవచ్చు. గవర్నమెంటు కరెంటు ఇవ్వకపోతే బ్యాటరీలు పెట్టుకోవచ్చు. ఆ దృష్టితో ఆధ్యాత్మికతను ప్రపంచానికి అందచెయ్యాలి.
వైజ్ఞానిక దృష్టికోణముతో ఆధ్యాత్మికతను చూపించటం అంటే ఆధ్యాత్మికత విజ్ఞానము కాదు అని ముందు మనకు చాలా స్పష్టమైన అవగాహన ఉండాలి. ఎంచేతంటే అది ఇంద్రియాతీతమైన అనుభవం, ఇంద్రియాతీతమైన జ్ఞానం. పంచేంద్రియాల ద్వారా మనం దానిని పలుచన చేస్తాము. వైజ్ఞానిక దృష్టితో ఆధ్యాత్మికతను చూపించాలి అంటే మనం మనస్సులో గుర్తుంచుకోవలసింది ఏంటంటే విజ్ఞానము తర్వాత దర్శనము, దర్శనము తర్వాత ధర్మము అనే స్థితులు ఉన్నాయని. దానినే సీక్రెట్ డాక్ట్రిన్లో సైన్స్, ఫిలాసఫి అండ్ రెలిజియన్ అని చెప్పింది మేడమ్ బ్లావెట్స్కీ వైజ్ఞానిక దృష్టికోణంతో ఆధ్యాత్మికతను ప్రపంచానికి అందించే ప్రయత్నం మనం చేయాలి.
సింబల్స్ సంకేతాలు. ప్రపంచంలో ప్రతిదీ కూడా ఒకానొక విశిష్ట చేతనత్వానికి సంకేతము అని మనం దర్శించాలి. దర్శనం గురించి తెలుసుకునేటప్పుడు మనకు,,,,,,,,,,,,,,,,,,,,,