యంత్ర పరికరాలను చూసి నేను భలే ఆశ్చర్యపోతుంటాను, అవి ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవాలని ఒకటే కుతూహలంగా ఉంటుంది నాకు. అందుకే నొక్కుడు పెన్ను మొదలుకొని పాత రేడియో, అలారం క్లాకు మా నాన్న సైకిలు ఇలా నా చేతికి దొరికిన పరికరాలనన్నిటిని ఊడపీకేసి లోపల ఏముందా అని చూస్తుంటాను. ఇలా కనపడ్డ వాటినల్లా ఊడపీకేసే నా అలవాటు చూసి, ఫ్రెండ్స్ అంతా నన్ను ముద్దుగా 'బోల్టు' అని పిలుస్తుంటారు..............