ముగ్గురు సుందరుల కథ - ( సుందరకాండు రహస్యాలు)
రామాయణం మనలను తరింపజేయడానికి అవతరించిన వేదస్వరూపము. దరము ఎప్పుడూ సత్త్వగుణంతో ఉంటుంది. ఆ సత్త్వగుణం మనలో వర్ధిల్లితేగాని వంకిగా తరించలేము. జీవనసార్థకతను కూడా పొందలేము. వేదస్వరూపమైన రామాయణ శ్రవణం, మననం, పారాయణం ద్వారా మన మనఃప్రవృత్తిలో మార్పు వస్తుంది. మనలో, ప్రపంచంలో రాజస, తామస గుణాలు పెచ్చు పెరిగితే అదేరాక్షసత్వము. అవి మనలో బాగా పెరిగితే మనం వాటిని కూడా గమనించలేం.
ఈ రాజస, తామస ప్రవృత్తులు అసత్యాలను కూడా సత్యాలుగా ప్రచారం చేస్తూ ఉంటాయి. సత్యం నోరు నొక్కుతూ ఉంటాయి. దాని వల్ల శాంతి దెబ్బ తింటూ ఉంటుంది. అలాంటి రాజస, తామస ప్రవృత్తులు తగ్గి సాత్త్విక ప్రవృత్తి పెరగాలంటే మహర్షులు ఇచ్చిన సధ్రంథాలను నిరంతరం వ్యాప్తి చేయాలి. రామచంద్రమూర్తి ధర్మమూర్తి. ధర్మము అంటే సాత్త్వికము. అచ్చమైనట్టి సాత్త్వికపు మర్యాద అయినట్టివాడు అచ్చమైన గుండెకు మిక్కిలి దగ్గరైనవాడు పచ్చని మైడాలువాడు శ్రీరామభద్రుడై నీవు చెచ్చెర రావయ్యా శ్రీవేంకటేశ! శేషాద్రినిలయా!అంటారు విశ్వనాథవారు.
అచ్చమైనట్టి సాత్త్వికపు మర్యాద అయినట్టివాడు రామచంద్రమూర్తి. ఆయనకు మనం నచ్చాలంటే మన హృదయంలో అచ్చతనం ఉండాలి. అచ్చ అంటే స్వచ్ఛత్వం. స్వచ్ఛత ఉంటేనే స్వచ్ఛమైన, సత్త్వమూర్తియైనరామచంద్రమూర్తి అర్థం అవుతాడు. ఆనందం కలిగిస్తాడు.
రామచంద్రమూర్తిని ఆరాధన చేస్తూ ఉంటే మనఃప్రవృత్తిలో సాత్త్వికత ఏర్పడుతుంది. - రామకథని వింటే తప్పకుండా మన మనస్సులో ఒక మార్పు వస్తుంది. రాజస, తామస ప్రవృత్తులు తగ్గుతాయి. తామసంతో కూడిన అజ్ఞానము, రాజసంతో కూడిన తెంపరితనము నిగ్రహింపబడి సాత్త్వికమైన ధర్మము, జ్ఞానము ప్రబుద్ధము కావాలంటే రామాయణమే ఆధారం.