మానవతకు వందనం !
"ఆడపిల్లలంటే మన మేఘనలా ఉండాలి... కదండీ !" కూతురును తలచుకొని పొంగిపోతూ అన్నది సౌమ్య.
ఈమాట ఆమె రోజుకు కనీసం వందసార్లైనా అనివుంటుంది. ఎన్నిసార్లన్నా, ఆంజనేయునికి రామనామంలా ఆ మాటలు అరవింద్కు ఆనందాన్నిస్తాయే కాని విసుగు తెప్పించవు. భార్యమాటలకు రొటీన్ గా చెప్పే జవాబే అతను మరోమారు వినిపించాడు.....
"అ!"
గర్వంతో అరవింద్ యెద పొంగింది.
"అబ్బో! మీరే తొమ్మిదినెల్లూ మోసికన్నారు మరి !" చిరుకోపం ప్రదర్శించింది.సౌమ్య.
"కనడం గొప్పకాదే. పెంచడంలోనే ఉంది అంతా. యశోదకృష్ణుడంటారు. కాని దేవకి కృష్ణుడని ఎవరన్నా అనగా విన్నావా ? సీతను జానకి అనగా విన్నావుగానీ సునయనజ అనగా ఎప్పుడన్నా విన్నావా ?" తనకు తెలిసిన శాస్త్ర పరిజ్ఞానం ఒలకబోశాడు. అరవింద్.
"హుఁ! మీనోట్లో నోరు పెట్టడమే తప్పు. ఒకటంటే పదంటారు ..." మూతి ముడుచుకుంది సౌమ్య................