• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Muktha Sangayogi Trishathi

Muktha Sangayogi Trishathi By Dr Lagadapati Sangayya

₹ 100

                                                 మిత్రుడు డా|| లగడపాటి సంగయ్య ఇంతకుముందు ఏం పద్య కావ్యాలు వ్రాశాడో, ఏం బిరుదులు ఆర్జించాడో, ఎన్ని సన్మానాలు పొందాడు. నాకు తెలియదు గాని, కవిత్వ రచనపై, ముఖ్యంగా పద్య కవిత్వ రచనపై విశేషమైన మక్కువ గలవాడని ఈ "ముక్త సంయోగి సూక్తి వినుడి" అనే దాలా విశిష్టమైన మకుటంతో కనబడుతున్న "త్రిశతి" వలన తెలుస్తున్నది. మకుటంలోనే "సూక్తి" అనే పదం ఉన్నది కాబట్టి దీంట్లో తప్పనిసరిగా సూక్తులు ఉంటాయనే మనం ఆశించాలి. 'సూక్తులు' మాట దేవుడెరుగు, ఈ పుస్తకంలో లోకానికి అసలు ఏమాత్రం గిట్టని 'కటూక్తులు' గూడా కనబడతాయి. ఈ మాట ఎందుకంటున్నానంటే - ఎప్పుడైనా సమాజంలో 'నిజం' చేదుగానే ఉంటుంది. అందుకే 'చేదునిజం' అనే మాట వింటుంటాం! అందుకే కాబోలు విసుగుబుటి ఒకడు ఒంటి మీద గుడ్డలున్నాయో లేదో గూడా గ్రహించలేని స్థితిలోకి పోయి "నిజము దేవుడెరుగు, నీరు పల్లమెరుగు" అనేశాడు. వాడేం కూటికి గుడ్డకి లేనివాడు గాదు. సాక్షాత్తు యువరాజు లాంటివాడే ! సరే ! ముందుమాట. ముందుకు పోకుండా, యిలా పక్క పక్కకు ఎందుకు పోతుందంటే, ఈ కవి మిత్రుడు సంగయ్య పైకి చూచేటంతటి (అంటే కనబడే యంతటి) సాదాసీదా మనిషి కాడని ఇన్నాళ్ళకు, ఇన్నేళ్ళకు గ్రహించాను. మొత్తానికి ఈ కవి 90 పాళ్ళు నేను పైన చెప్పిన పై ప్రజాకవి మార్గాన్నే అనుసరించాడు. ఆయన చెప్పిన విషయాలనే చాలా వాటిని తన సొంత శైలిలో ఆవిష్కరించాడు. 

  • Title :Muktha Sangayogi Trishathi
  • Author :Dr Lagadapati Sangayya
  • Publisher :Madhuri publications
  • ISBN :MANIMN2788
  • Binding :Paerback
  • Published Date :2021
  • Number Of Pages :266
  • Language :Telugu
  • Availability :instock