ఆద్యుడు - ఆరాద్యుడు : భాగ్యరెడ్డివర్మ
-డా. యాగాటి చిన్నారావు
శ్రీ భాగ్యరెడ్డివర్మగారి 119వ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని 'సమాంతర వాయిస్ ' పత్రిక ప్రత్యేక సంచికను తీసుకురావటం చాలా సముచితం మరియు అవసరం కూడా. ఎందుకంటే మనలో చాలామందికి, అంటే విద్యావంతులకు, దళిత కార్యకర్తలకు, నాయకులకు కూడా భాగ్యరెడ్డి వర్మ గురించి ఒకటిరెండు విషయాలు ఆ నోటా ఈ నోటా వినటమే తప్పా వివరాలు ఎక్కువగా తెలియవు. కాబట్టి భాగ్యరెడ్డిలాంటి మరెందరో మహనీయుల త్యాగాలు గురించి మన ప్రజానీకానికి తెలియాల్సిన, తెలియ జెప్పాల్సిన అవసరం, బాధ్యత ఈనాటి మన దళిత పత్రికల మీద ఉంది.
భాగ్యరెడ్డిగారి గురించి తెలుసు కోవటమంటే ఆంధ్రప్రదేశ్ దళిత ఉద్యమం గురించి తెలుసుకోవటం. ఎందుకంటే, చారిత్రకంగా దొరికిన ఆధారాలను బట్టి దళిత ఉద్యమం సంఘటిత పడింది, ఒక సంఘంగా ఏర్పడిందీ ఆ మహనీయుని నాయకత్వంలోనే.............