ఉపాధ్యాయుడు చెప్పే పాఠాన్ని తన అన్వయించుకున్న విద్యార్థి గొప్పవాడవుతాడు. అది జీవితానికి సరిగ్గా అన్వయించుకున్న పక్షంలో బాగుపడతాడు. తప్పుగా అన్వయించుకుంటే, చిక్కుల్లో పడతాడు. తనకే తెలియని అగాధంలో ఇరుక్కుపోతాడు. అలాంటి అగాధాలలో సాలె గూళ్ళలా ఎన్నో చిక్కులుంటాయి. ఇలా జరిగిన దాఖలాలు లేకపోలేదు. ఉపాధ్యాయులు చెప్పే పాఠాల్ని కొందరు విద్యార్థులు పక్కదారిలో ఉపయోగించిన దాఖలాలు కూడా లేకపోలేదు. గతంలో, సుమారు 2005 ప్రాంతంలో రీచార్జ్ కార్డులు అమ్మే రోజులవి. ఒక విద్యార్థి ఇంటర్మీడియట్ మేథమెటిక్స్ లో పెర్ముటేషన్స్ కాంబినేషన్స్ అనే లెక్క యొక్క పద్దతిని ఉపయోగించి, అప్పటికే గీకేసి ప్రీపెయిడ్ రీచార్జ్ చేసేసి పారేసిన ఐడియా రీచార్జ్ కార్డులను ఏరి, అందులో ఉన్న పదహారంకెల నెంబర్లతో పర్ముటేషన్స్ లెక్క చేసి ఆ వచ్చిన జవాబుతో మళ్ళీ ఉచితంగా రీచార్జ్ చేసుకోవచ్చనే కిటుకుని కనిపెట్టాడు. దానిని లెక్కలేనన్ని సార్లు అమలు చేసి ఉచితంగా తన మొబైల్ రీచార్జ్ చేసుకునేవాడు. మిత్రుల వద్ద ప్రతి రీచార్జ్ కి యాభైరూపాయలు తీసుకుని తాను కనిపెట్టిన ట్రిక్తో ఉచిత రీచార్జ్ చేసేవాడు. ఎంత రీచార్జ్ జరిగినా...................