• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Muniraja Maheswaram

Muniraja Maheswaram By Dr Manohar Kotakonda

₹ 350

మే నెల 26 వ తేది, 2010...

ఉదయం పదకొండు గంటలు...

"కాలం అంటే ఏమిటి?...

అది స్థిరమైతే ఎక్కడుంది?... అ

స్థిరమైతే చలనశీలత ఎటువైపు?...

చలిత అయితే దాని మాధ్యమం ఏది?...

దాని ఉనికి ఎక్కడ? ....

టిక్ టిక్ మనే దాని చప్పుడు ....

లబ్ డబ్లతో అనుసంధానమై.... మనుషుల బ్రతుకుల్లో ప్రవహించినప్పుడే కదా కాలం తన ఉనికిని చాటుకునేది.

ఆ కాలం జీవంతో ప్రయాణం చేస్తూ ఇదిగో ఇలా...... నూట ముప్పై ఆరు అడుగుల ఎత్తుగా, అయిదు వందల సంవత్సరాలుగా, గోపురమై వికసించేది... మహారాజ గోపురమై పదికాలాలు తలఎత్తి గర్వంగా నిలబడి ఉండేది. కాలమే గోపురమై, గోపురమే కాలమై మన అందరికీ కాళహస్తి క్షేత్రానికి దారిచూపే దిక్సూచి అయ్యేది...” కెమెరా ముందు ఖంగుమంటూ మహేశ్వర్ కంఠం పలికింది.

సరిగ్గా ఒకరోజు ముందు...

సాయంత్రం...

+++

కాలపురుషుడి మంటపాన్ని ఒక్కగెంతులో ఎక్కాలని హుఁప్ మంటూ ఎగిరాడు అబ్దుల్లా కరీం సాయిబు.

అతడు మునిరాజు కంటే ఒక్క అడుగు కురచగా ఉండటంతో అందలేదది.

రెండు చేతులమీద తన బరువును లేపి కుడిమోకాలి ఆపుతో శరీరాన్ని మంటపంపైకి చేర్చాడు. నిలబడి ఒక్కసారి నిటారైనాడు..................

  • Title :Muniraja Maheswaram
  • Author :Dr Manohar Kotakonda
  • Publisher :Kalachitra Prachurana
  • ISBN :MANIMN6166
  • Binding :Papar Back
  • Published Date :March, 2025
  • Number Of Pages :126
  • Language :Telugu
  • Availability :instock