• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Muraleeyam

Muraleeyam By Dr K S G Murali Krishna

₹ 200

  1. కలియుగ దైవం

తిరుమల తిరుపతి దేవుడు ఎలా దేవుడయ్యాడు? వేయి సంవత్సరాల క్రితం నాటి మాట. కలియుగదైవం శ్రీమన్నారాయణుని | ప్రతిరూపమైన వేంకటేశ్వరుని శిల్పం కోసం | శిల్పులు ఒక కొండ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడున్న కొన్ని శిలలను పెద్ద పెద్ద ఇనుప సుత్తులతో మోదారు. కొన్ని నాలుగైదు దెబ్బలకి పడిపోతే, కొన్ని ఏడెనిమిది దెబ్బలకి పడిపోయాయి. పదిదెబ్బలకి తట్టుకుని ఆగిన ఒక శిలను, అన్ని వైపుల నుండి మరో 10 ఇరవై దరువులు వేశారు. ఎత్తునించి పడేశారు. అయినా ఆగింది. ఆపై ఆ శిలను 5. దొర్లించుకుంటూ తమ ప్రాంతానికి తీసుకెళ్ళారు. అక్కడ చాలా మంది శిల్పులు రకరకాలుగా సుత్తులతో కొట్టారు. కంఠాణిలతో పొడిచారు. రంపాలతో కోసారు. మరలతో తిప్పారు. రకరకాల రసాయనాలు వాడి ముక్కలు ముక్కలుగా కోసారు. ఎట్టకేలకు ఒక చక్కని విగ్రహన్ని తయారు చేసారు. దాన్నే తిరుమల తిరుపతిలో వేంకటేశ్వరుని దివ్య మంగళప్రతిమగా ఉంచారు. పూజలు చేశారు. నాలుగైదు దెబ్బలకే విరిగిపోయిన శిలాఫలకాలను విగ్రహం కాళ్ళ దగ్గర రాళ్ళగా వాడారు.

ఈ మధ్యకాలంలో ఒక రాయి విగ్రహాన్ని అడిగిందట "మనందరం ఒకే చోట కలిసి జీవించాం. ప్రకృతి ఒడిలో ప్రక్కపక్కనే ఉన్నాం. నిన్నందరూ దేవుడిగా కొలుస్తున్నారు, మొక్కుతున్నారు, కలియుగంలో కావలసినవి ధనకనక వస్తు వాహనాలు కాదు. ఆకలి కావాలి, ఆకలి... ఆ కలియుగదైవాన్ని దర్శించాలన్న ఆకలి కావాలి అని అనుకుని ప్రపంచం నలుమూలలనుంచీ కోట్ల మంది ప్రజలు తండోపతండాలుగా వచ్చేస్తున్నారు. పూజిస్తున్నారు, కానీ మమల్ని మటుకు కాళ్ళతో తొక్కేస్తున్నారు. ఏమిటి కారణం" అని. దానికి చిరుమందహాసాలు చిందిస్తూ ఆ దివ్యమంగళ రూపం ఇచ్చిన సమాధానం "మనం కలసి ఒకే ప్రకృతి తల్లి ఒడిలో పెరిగాం, ఒకే బడిలో కలిసిచదువుకున్నాం. కానీ, నాలుగైదు దెబ్బలకే తట్టుకోలేక వీగిపోయారు మీరు. రకరకాల మనుషులు రకరకాలుగా కొట్టినా, పొడిచినా, అన్నింటినీ ఓర్పుతో సహించి, అన్ని అవాంత రాలకీ, కష్టాలకీ, ఒడిదుడుకులకీ నిలదొక్కుకున్నాను నేను. అందుకే ప్రపంచం నన్ను దేవుడిగా కొలుస్తోంది, మిమ్మల్ని తొక్కేస్తోంది. శిలత్వం నుంచి శివత్వం అంటే ఇదే!"

ఐదారేళ్ళు ఆర్ధిక, శారీరిక, సామాజిక, మానసిక, భాషా ఇబ్బందులను ఎదుర్కొని, ధైర్యంగా నిలదొక్కుకుని ఉన్నవాడే మిగిలిన 60 ఏళ్ళు అందరిమన్ననలూ అందుకుంటాడు, ఆదర్శప్రాయమవుతాడు. దేవుడిలా కొలవబడతాడు. ప్రతీదానికీ కుమిలిపోతూ, ఏవరూ ఏమీ అనకూడదు. అనుకోకూడదు, నా మీద జోకు వెయ్యకూడదు. ఎగతాళి చెయ్యకూడదు, తప్పులు పట్టకూడదు. ప్రశ్నించకూడదు అని అనుకుంటే ఈ నాలుగేళ్ళు బానే ఉంటుంది. తరువాత 60 ఏళ్ళు జనాలు తొక్కేడమే! కుక్క బ్రతుకే! నిప్పుతో కడిగినా సమాజానికి దయా దాక్షిణ్యాలు ఉండవు. "సాధారణ మనుషుల్లోనే........................

  • Title :Muraleeyam
  • Author :Dr K S G Murali Krishna
  • Publisher :Envinormental Educational Socity
  • ISBN :MANIMN4296
  • Binding :Papar back
  • Published Date :june, 2016 8th print
  • Number Of Pages :605
  • Language :Telugu
  • Availability :instock