• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Musafir Yakoob Kavitwam 1983- 2021

Musafir Yakoob Kavitwam 1983- 2021 By Kavi Yakoob Commitee

₹ 600

నా కవిత్వమే నా ఆత్మకథ

'చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా' బహుశా నేను మననం చేసుకున్న తొలిపాట. ఈ పాట చెంచులక్ష్మి సినిమాలోనిది. అప్పుడే కొత్తగా కట్టిన మా ఊరు పక్కన కారేపల్లి టూరింగ్ హాల్లో నేను చూసిన మొదటి సినిమా. ఆ తడికల హాల్లో ఆఠాణా టిక్కెట్టు కొనుక్కొని ముందు వరుసలో కూర్చుని ఆ సినిమా చూసినప్పటి అనుభవం మరిచిపోలేనిది. అట్లా తెర మీద బొమ్మలు కదలడం, పాటలు పాడుకోవడం నాకో అద్భుతం. రెండవ సినిమా 'సంపూర్ణ రామాయణం'. ఆ సినిమా చూడ్డం నాకో గొప్ప వింత అనుభవం. పద్నాలుగు మైళ్ళు నడిచి, ఇల్లెందులో సెకండ్ షో చూసి మిగిలిన పావలాతో పాటల పుస్తకం కొనుక్కొని రావడం నేను చేసిన గొప్ప పని. 'ఠంఠం ఠమ్మని భీష్మనాధ్వనుల వింటన్ నారి సారించి' పద్యం హనుమంతుడు రావణుడి సభలో ఆవేషంతో పాడ్డం నాకు గొప్ప ఉద్వేగాన్నిచ్చిన సంఘటన. ఇవి నాకు తొలి ప్రేరణలు పాటలు పాడ్డానికి.

మా నాన్న అమ్మ అక్షరముక్కలు రాని అన్నాడులు. మా అమ్మ రాత్రంతా పొయ్యి దగ్గర కూచుని అప్పచ్చులు చేసేది. ప్రొద్దున్నే మా నాన్న కావడి భుజానేసుకుని ఒకవైపు అప్పచ్చులు, మరోవైపు కిరాణా సామాన్లు పెట్టుకుని ఊరూరా తిరిగి అమ్ముకొస్తుండేవాడు. రాత్రంతా జాగారం చేసి పొద్దున్నే భుజాన బొక్కులు పెట్టుకుని సత్తుగిన్నెలో చల్లన్నం పెట్టుకుని పొలం గట్టాల మీద పడుతూ లేస్తూ రైలు పట్టాలమీద బ్యాలెన్స్ చేసుకుంటూ వేళ్ళపొట్టలు కంకర రాళ్ళు తగిలి పగిలిపోతుంటే మట్టిని...............

  • Title :Musafir Yakoob Kavitwam 1983- 2021
  • Author :Kavi Yakoob Commitee
  • Publisher :Kavi Yakoob@60 commitee
  • ISBN :MANIMN3849
  • Binding :Paerback
  • Published Date :March, 2021
  • Number Of Pages :618
  • Language :Telugu
  • Availability :instock