ప్రోలయ్య బాల్యం
ప్రోలయ్య వేంగి ప్రభువు అయిన ముసునూరి పోచయ్య నాయకుని పెద్ద కుమారుడు. ప్రోలయ్య తల్లి సూరాంబ. పోచయ్య - సూరాంబ దంపతులకు ఇద్దరు కుమారులు జన్మించారు. ప్రథమ సంతానం ప్రోలయ్య కాగా రెండవ వాడు ఎర్రపోతానీడు, ప్రోలయ్య తాత గారు గొప్ప ప్రభువుగా పేరు గడించిన వేంగి నాయంకరుడు ముసునూరి పోతయ్య నాయకుడు. ఇతను కాకతీయ రుద్రమదేవికి సామంతునిగా వేంగి రాజ్యాన్ని పరిపాలించాడు. ప్రోలయ్య ముత్తాత వేంగి నాయంకరుడు. ముసునూరి ముచ్చి నాయకుడు. ఇతనికి మహామండలేశ్వర వంటి గొప్ప హెడా ఉంది. ప్రోలయ్యకు ముగ్గురు బాబాయిలు ఉన్నారు. మొదటి బాబాయి ముసునూరి దేవయ్య. ఇతనికి ఇద్దరు కుమారులు కాపయ్య మరియు ముమ్మడయ్య, రెండవ బాబాయి ముసునూరి కామయ్య. ఇతనికి ఇద్దరు కుమారులు దేవానీడు, ఇమ్మడేసుడు. మూడవ బాబాయి ముసునూరి రాజయ్య. ఇతనికి ఒక కుమారుడు అనపోతానీడు.
ప్రోలయ్య తన ఆరుగురు తమ్ముళ్లు అయిన ఎర్రపోతానీడు, కాపయ్య, ముమ్మడయ్య, దేవానీడు, ఇమ్మడేసుడు మరియు అనపోతాలతో కలిసి వేద పాఠశాలకు వెళ్లి. వేద విద్యను అభ్యసించేవాడు. ప్రోలయ్యకు ఋగ్వేదం, యజుర్వేదం మీద మంచి పట్టు ఉండేది. రాజకుటుంబం కాబట్టి ప్రత్యేక దినాలు మరియు పండుగల రోజుల్లో వేద పండితులే ముసునూరి వంశీకుల రాజభవంతికి వచ్చి ఈ ఏడుగురు అన్నదమ్ములకు వేద విద్య నేర్పేవారు. ప్రోలయ్య మొట్టమొదటి వేద గురువు కాశ్యప గోత్రీకుడైన అనంతయ్య పండితుడు. వేద విద్యతో పాటు క్షాత్ర విద్యలో కూడా రోజూ ప్రోలయ్యకు శిక్షణ ఉండేది. విలువిద్యలో ప్రోలయ్య మంచి ప్రతిభ కనబరిచేవాడు. భరద్వాజ గోత్రానికి చెందిన మల్లయ్య విలువిద్యలో ప్రోలయ్యకు మొట్టమొదటి గురువు, మల్లయ్యది పరశురాముని అంశ అంటారు. అతను ప్రోలయ్యను త్రిలింగదేశంలోనే ఒక గొప్ప విలుకారునిగా తీర్చి దిద్దాలి....................