• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

My Peru Gauhar Jaan

My Peru Gauhar Jaan By Guntur Kumara Lakshmanasastry

₹ 280

తన కళ్ళముందు రూపుదిద్దుకున్న మహా నిర్మాణం. మెల్లగా మెట్లెక్కి సువిశాలమైన మండపంలోకి చేరుకున్నాడు. చుట్టూ అద్భుతమైన శిల్పసంపద ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తరువాతి తరాలు తనని చూడవు, తన వంశాన్నీ చూడవు. కాని ఈ భవ్య నిర్మాణం శతాబ్దాల పాటు శాశ్వతంగా నిలిచి వుంటుంది. 'దర్శించిన ప్రతివారు "నివరయ్యా దీన్ని నిర్మించింది" అని నన్నోసారి తలచుకుంటారు.' అని చిన్నగా తృప్తిగా నవ్వుకున్నాడు. దర్పంగా నిలబడ్డ హిమశిఖరాలు వెనుక మెరుస్తుండగా తలెత్తుకుని మహా వైభవంగా నిలబడి వుంది, ఎత్తయిన గుట్టపై కశ్మీర్ లోయను చూస్తూ మార్తాండ దేవాలయం. సూర్యుడు ప్రధాన దేవతగా ఆరాధించబడే ఈ ఆలయంలోని 220×142 అడుగుల మహా మండపం దాటి గర్భాలయం చేరాడు. అతడి ఆదేశం మేరకు ఆలయ నిర్మాణం గాంధార, గుప్త, చైనీయుల శిల్పకళల సమ్మేళనంగా జరిగింది. భారతీయ శైలికి గ్రీకు, రోమన్ శైలి కలిస్తే అది మార్తాండ ఆలయం. ఆవరణ మధ్యలోని విశాలమైన తటాకంలో చుట్టూ ఉన్న ఎనభై నాలుగు ఉపాలయ శిఖరాల ప్రతిబింబాలు స్వచ్ఛంగా, స్పష్టంగా మెరుస్తూ, తటాకం అందాన్ని పదింతలు చేస్తున్నాయి. ఆలయ కుడ్యాలు స్థంభాల మీద హిందూ దేవతలైన శివుడు, విష్ణువు, గంగా యమునా నదులు, ఇతర దేవతల విగ్రహాలు అద్భుతంగా చెక్కబడ్డాయి.

ఎన్నో యుద్ధాలు గెలిచి, ఇంటికి చేరుకున్న ఆ వీరుడికి ఆ క్షణాన ఎంతో ప్రశాంతత లభించింది. ఇదంతా నాకు భగవంతుడు ప్రసాదించిన భాగ్యం అని చుట్టూ చూస్తూ తృప్తిగా నవ్వుకున్నాడు. 'ప్రపంచ విజేత'గా పేరొందిన కశ్మీర చక్రవర్తి లలితాదిత్య ముక్తాపీడుడు అతను.

అంత అపురూపమైన శిల్పసంపదను పదిహేనో శతాబ్దంలో షామిరి వంశానికి చెందిన కిరాతకుడు సుల్తాన్ సికందర్ బుత్షికన్ విధ్వంసం చేయించాడు. 1909లో బ్రిటిష్ ఆర్మీ అధికారి, పరిశోధకుడు సర్ ఫ్రాన్సిస్ యంగస్బెండ్ మార్తాండ ఆలయం దర్శించి, శిథిలాలపై పరిశోధన చేసి, ఒకప్పటి ఆలయం వైభవం గురించి చెప్పేవరకూ ప్రపంచం మరిచిపోయింది.

లలితాదిత్య పూర్వీకులు :

ఈ అపూర్వ నిర్మాణానికి పూనుకుని పూర్తి చేసిన లలితాదిత్య చక్రవర్తి కర్కోట వంశంలో నాలుగోవాడు. కశ్మీర్ కేంద్రంగా పాలించిన ఈ వంశం గురించిన పూర్తి..................

  • Title :My Peru Gauhar Jaan
  • Author :Guntur Kumara Lakshmanasastry
  • Publisher :Godavari Prachuranalu
  • ISBN :MANIMN5151
  • Binding :Papar back
  • Published Date :2024
  • Number Of Pages :252
  • Language :Telugu
  • Availability :instock