• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Na Ayudham Kavitvame

Na Ayudham Kavitvame By N Venugopal

₹ 220

దిక్కుదిక్కునా గీతములే...

అనువాదం ప్రతి మనిషికీ సహజమైన, అనివార్యమైన ప్రక్రియ. పంచేంద్రియాలు మాధ్యమంగా భౌతిక ప్రపంచాన్ని భావనా ప్రపంచంలోకి ప్రతిక్షణం అనువదించుకోకుండా మనిషికి ప్రకృతీ సమాజమూ అర్థమే కావు, తనకు తానే అర్థం కారు. ఆ భావనా ప్రపంచపు ఆదేశాలను ఆయా అవయవాల కర్తవ్యాలుగా అనువదించుకోలేకపోతే మన నిత్యజీవిత, అనుక్షణ ఆచరణే లేదు. అంటే మనుగడే లేదు.

ఇలా మనుషులకు అత్యంత సహజమైన, నైసర్గికమైన, అనివార్యమైన, అవిభాజ్యమైన అనువాద ప్రక్రియ భాషల మధ్య అనుసంధానం దగ్గరికి వచ్చేసరికి మాత్రం కష్టమూ క్లిష్టమూ అవుతున్నది. నిజానికి భిన్న సమూహాల మధ్య వైవిధ్యం వల్ల భాషా సంపర్కం, అనువాదం అత్యవసరమైనది కావడం వల్ల భాష ఎంత పాతదో భాషానువాదం కూడా అంత పాతదే అయి ఉంటుంది. సైగల భాష క్రమంగా మాటల భాషలోకి మారుతున్నప్పుడే ఒకే సమూహపు భిన్నమైన మాటల మధ్యా, భిన్న సమూహాల ఒకే రకమైన మాటల మధ్యా అనువాదం ప్రారంభమై ఉంటుంది. ఇంత ప్రాచీనమైనదీ, మానవ సమాజం వేల సంవత్సరాలుగా అలవాటు పడినదీ అయినప్పటికీ, భాషానువాద ప్రక్రియ ఇప్పటికీ కష్టసాధ్యమైన పనిగానే కనబడుతున్నది. బహుశా అందువల్లనే ఇతర సాహిత్య, కళా ప్రక్రియలలోకి ప్రవేశించినంత ఎక్కువ మంది అనువాదంలోకి ప్రవేశించడం లేదు. ప్రవేశించినవారి కంటే ఎక్కువ మంది విమర్శకులు ఉంటున్నారు. అనువాదకులు ఒకరుంటే తప్పులెన్నేవాళ్లు పది మంది ఉంటున్నారు..........................

  • Title :Na Ayudham Kavitvame
  • Author :N Venugopal
  • Publisher :Swecha Sahity
  • ISBN :MANIMN5963
  • Binding :Paerback
  • Published Date :Dec, 2024
  • Number Of Pages :237
  • Language :Telugu
  • Availability :instock