• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Na Diary Raktha Reka (The Arc of Blood)

Na Diary Raktha Reka (The Arc of Blood) By Seshendra Sharma

₹ 200

రక్తరేఖ

ARCOF BLOOD : POET'S NOTE BOOK

(January 1952- August 1974)

I dream of living in a house where almost the forest comes into our premises and the birds keep carrying the messages of trees and Winds.

In this sanctified moment of meditation I am stringing together all those eternal voices that punctuate the history of mankind singing the glories of love.

Reading ancient poetry is like enjoying the light of stars, that died millions of light years ago.

The bird is the voice of the tree and the flowers its dreams.

జీవితంలో మనిషికి సుఖాలకంటే దు:ఖాలే దొరుకుతాయి. ఆ దొరికిన సుఖాలు రాత్రి | నక్షత్రాల్లా పగలు పోతాయి. సుఖాల వలలో చిక్కినవాడు విధి తినే చేప; కన్నీటి బిందువులు | ద్రాక్ష పళ్ళుగా తోచే వాడికి, విధి చంటిపాప. చివరకు సుఖాలు కాదు మిగిలేది; ఆ మిగిలేదేదో | అదే నీకు జీవనసత్యాన్ని చూపిస్తుంది.

అందుకనే మనిషిని కన్నీళ్ళతో చేశాడు దేవుడు. నడవడానికి దారిలేదు. కాళ్ళరక్తం తాగుతోంది, దారి. కాని నడుస్తున్నా చీకట్లు చీల్చుకుంటూ పోతున్నా ఉషస్సును కలుద్దామనే ఆశతో,

నేను రక్తనాళాల్లో కవితని ప్రవహింప జేద్దామని ఆశిస్తుంటే, భగవంతుడు విషాన్ని ప్రవహింపజేస్తున్నాడు.

చిత్రలేఖనం సులువు. వాడు కుంచె రంగుల్లో ముంచుతాడు. కవి గుండె బాధల్లో ముంచాలి- బోదెలేయర్ మధువయి నా గొంతులోనించి దొర్లి రక్తనాళాల్లో ప్రవహిస్తున్నాడు | నఖశిఖ పర్యంతమూ. అందరు మహాకవులూ ద్రాక్ష గుత్తులు, వాళ్ళను పిండి తీసిన | | మధుసారం, తాగి, జీవించే క్షణాలు కొన్ని కలిపితే- అవి నేను. కనుకనే వాళ్ళు జీవించిన | క్షణాల్ని చెప్పేవాక్యం మనసు కొస్తుంది, ఏ పువ్వునో, ఏ సెలనో, ఏ కన్నీటి అలనో చూచినప్పుడు. అప్పుడు నేనెక్కడ ఉన్నా ఏ ఆనంద శిఖరాల నఖరాంకురాలు సోకుతున్నా, నాలో వాళ్లు జీవించిన క్షణం జీవిస్తుంది. ఆక్రోశిస్తుంది, ఎలుగెత్తి పిలుస్తుంది. "రమ్యాణి వీక్ష్య మధురాంతం నిశమ్య శబ్దాన్, పర్యుత్సుకో భవతి యత్సుఖితోపి జంతు."

ఆ పాట వినబడుతూ ఉంటుంది. హృదయాన్ని తియ్యటి బాధలతో కలత పెడుతూ ఉంటుంది. కానీ ఆ పక్షి ఎక్కడ ఉందో ఎంత వెతికినా కనిపించదు; తోటంతా గాలించాను. .............

  • Title :Na Diary Raktha Reka (The Arc of Blood)
  • Author :Seshendra Sharma
  • Publisher :LokNayak Foundation
  • ISBN :MANIMN3749
  • Binding :Papar back
  • Published Date :Oct, 2022 3rd print
  • Number Of Pages :189
  • Language :Telugu
  • Availability :instock