బహుముఖ ప్రజ్ఞాశాలి
నాటి స్వాతంత్య్ర సమరయోధులైన "మద్దూరి అన్నపూర్ణయ్యగారు, అల్లూరి సత్యనారాయణరాజుగారికి, రాజకీయ గురువులు. అలాగే మా నాన్నగారైన మండలి వెంకట కృష్ణారావుకు, అల్లూరి సత్యనారాయణరాజుగారు రాజకీయ గురువులు. 1957లో మా నాన్నగారిని నాటి కాంగ్రెస్ పార్టీ తరపున ఎం.ఎల్.ఏ.గా మచిలీపట్నం నుంచి పోటీ చేయించి వారి గెలుపుకు ముఖ్యపాత్ర వహించారు. అప్పటి ప్రత్యర్థి చల్లపల్లి జమీందారు గారు ! వీరు జస్టిస్ పార్టీ తరుపున పోటీ చేశారు. ఆయన అంగబలం, ఆర్థికబలం బాగా వున్నవాడు. అయినా ఆయనకు పోటీగా మా నాన్నగారిని నిల్చోబెట్టి, గెలుపు వరించేలా చేశారు. ఆ కాలంలో ఈ గెలుపును, స్థానిక ప్రజలు కథలు కథలుగా చెప్పుకొన్నారు.
మా నాన్నగారి కాలం నుంచి, అల్లూరి సత్యనారాయణరాజు గారి కుటుంబంతో సాన్నిహిత్యం కొనసాగుతూ వస్తోంది. అల్లూరి గారి ప్రథమ సంతానం కీ.శే. సుబాష్ చంద్రబోస్ గారు రాజకీయ ప్రవేశం చేసి యం.పి.గా గెలువడానికి, మా నాన్నగారు తమ వంతు సహకారం అందించారు. నాకు, సుబాష్ చంద్రబోస్ గారికి మరియు మరొక కుమారుడు జితిన్ గారితో సాన్నిహిత్య మెక్కువ. డాక్టర్ సోమరాజుగారు కర్నాటకలోని గంగావతిలో వుండటం వల్ల వారితో సాన్నిహిత్యం తక్కువ! అయితే 2020లో నరసాపురంలో వారి తండ్రి గారి పేరిట జరిగిన ఓ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. అప్పటి నుంచి డాక్టర్ సోమరాజుగారితో సాన్నిహిత్యం పెరిగింది.
హైదరాబాదులో, విజయవాడలో జరిగిన అల్లూరి సత్యనారాయణరాజు గారిపై రాసిన "అల్లూరి సత్యనారాయణరాజు" స్వాతంత్రోదమ నవల ఆవిష్కరణ సభలో నేను పాల్గొని ప్రసంగించటం జరిగింది.
అల్లూరి సత్యనారాయణరాజుగారు కేవలం స్వాతంత్య్ర సమరయోధులే కాదు బహుముఖ ప్రజ్ఞాశాలి. నాటి రాజకీయాల్లో స్టేట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా,....................