Logili Books

Autobiography and Biography

Na Jeevita Katha Maxim Gorky

By Maxim Gorky

₹600
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Na Jeevita Katha Maxim Gorky
Author
Publisher
Sahiti Prachuranalu
ISBN
MANIMN6782
Binding
Hard Binding
Published Date
Dec, 2025
Number Of Pages
830
Language
Telugu
Availability
In Stock
About this book

ఇరుకుగా వున్న చీకటిగదిలో కిటికీకి దగ్గరగా నేలమీద మా నాన్న పడుకున్నాడు. తెల్లని దుస్తులు తొడుక్కుని అలా పడుకుని వుంటే యెంతో పొడుగరిలాగ కనబడ్డాడాయన. కాలివేళ్ళు, అదొక మోస్తరుగా ఒకదాని కొకటి యెడమ యెడమగా వున్నాయి. ప్రశాంతంగా గుండెలమీద పెట్టుకున్న మృదువైన చేతివేళ్ళు కూడా కొంకర్లుపోయున్నాయి. కళ్ళమీద వుంచిన నల్లని రాగి నాణేలు ఆయన ఉల్లాసపు కళ్ళను కప్పుతున్నాయి. దయతో ఉట్టిపడుతూండే ఆయన ముఖం నల్లబారిపోయింది, బిర్రబిగుసుకు పోయిన ఆయన పళ్ళు మెరుస్తూండడం చూచి నాకు భయం వేసింది.

అమ్మ ఆయన దగ్గర మోకాళ్ళమీద కూచుంది. అమ్మ వంటిమీద ఎర్ర గాగరా వొక్కటే వుంది, ఆమె అలా కూచుని పట్టులాంటి ఆయన జుట్టును నల్లని దువ్వెనతో నుదుటి మీద నుండి వెనక్కి దువ్వుతూంది. నేనా దువ్వెనతోనే పుచ్చకాయ తొక్కలను రంపంతో కోసినట్టు కోసేవాణ్ణి. మంద్రమైన గొంతుకతో ఏమిటేమిటో ఆమె అలా గొణుగుతూనే వుంది. ఆమె బూడిదరంగు కళ్ళు వాచిపోయి పెద్ద కన్నీటి బొట్టుల కింద కరిగిపోతూన్నట్టని పించింది నాకు.

మా అమ్మమ్మ నా చేయి పట్టుకుంది. అమ్మమ్మ స్థూలంగా గుండ్రంగా వుంది. పెద్ద తల, పెద్ద పెద్ద కళ్ళు, మాంసపు ముక్కలా ముక్కు, ఆ ముక్కు చూస్తేనే నాకు నవ్వొచ్చేది. ఆమె అంత నల్లగా వుండికూడా మృదువుగా అద్భుతంగా కనబడుతోంది. ఆమె కూడా యేడుస్తూనే వుంది. ఆమె యేడుపు అదొక విధంగా వుండి అమ్మ యేడుపుకి వెనక పాటలా వినడానికి ఇంపుగానే వుంది. ఆమె వొళ్ళు అంతా వణికిపోతూనే నన్ను నాన్న దగ్గరకి నెట్టుతూంది. నేను మాత్రం ముందుకు రాకుండా ఆమె గాగ వెనక దాగుకున్నాను. నాకు భయంవేసి యేమిటోలా వుంది............................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?