• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Na Rajinama

Na Rajinama By Comrade Gurram Kotaiah

₹ 100

ప్రధాన కార్యదర్శి, పొలిట్బ్యూరో బాధ్యతలకు నేను ఎందుకు రాజీనామా చేశాను?

ప్రియమైన కామ్రేడ్స్!

22.8.75న నేను సాలిట్బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులకు రాసిన లేఖలో నా రాజీనానూకు కారణాలు సంక్షిప్తంగా పేర్కొన్నాను. అని...

  1. అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడడమనే పేరిట సామ్రాజ్యవాద అనుకూల, అర్థసైనిక ఫాసిస్టు (పారామిలటరీ) ఆర్.ఎస్.ఎస్ గుండె కాయగా వుండే జనసంఘ్ సమిష్టి పోరాటాలకు అనుకూలంగా కేంద్ర కమిటీ మెజారిటీ తీర్మానించింది. ఆ తీర్మానం మన పార్టీకీ, ఇటు దేశంలోను, విదేశాలలో వుండే ప్రజాస్వామిక సమూహాలలో నష్టదాయకమని, సామ్రాజ్య వాద వ్యతిరేక సోషలిస్టు శక్తుల నుండి వేరుపడడానికి దారితీస్తుందని నేను భావిస్తున్న కారణంగా;
  2. ఎత్తుగడల పంథాను నిర్థిష్టపరచడంలోనూ, దానిని ట్రేడ్ యూనియన్, కిసాన్ మరియు ఇతర ప్రజారంగాలకు అన్వయించడంలోను, పార్టీ నిర్మాణాన్ని దాని రహస్య బహిరంగ సెక్షన్లను నిర్మించడానికి అన్వయించడంలోనూ పొలిట్ బ్యూరో విఫలమైంది. ఆచరణలో ఎత్తుగడల పంథా నిరుపయోగంగా మార్చబడింది. అందువల్లనూ;
  3. తన డిమాండ్లను రూపొందించుకొనడంలో, తమ డిమాండ్లకు అను కూలంగా ప్రజాతంత్ర శక్తులను, ఇతర వర్గాలను అనుకూలంగా మలుచు కొనే విషయంలోనూ, పార్టీ శాఖలను ఏర్పర్చడంలో, ప్రాక్షన్స్ ఏర్పాటు, వాటి పని విధానంలో ప్రధానంగా అఖిల భారతస్థాయిలో పార్టీ కేంద్రానికి, రాష్ట్ర కమిటీలకు అతీతంగా మన ప్రధానవర్గ రంగమైన టి.యు పని చేస్తున్న తీరు మూలంగానూ;
  1. తగినంతమంది కేడర్ను కేటాయించక, వ్యవసాయ కార్మికుల పేద రైతుల మధ్య ఒకవైపు, మరొకవైపు మధ్య తరగతి రైతులతోనూ ఐక్యతను సాధించేందుకు, ఆచరణలో వ్యవసాయిక తీర్మానంపట్ల తీసుకోవలసిన చర్యలను ప్రధాన పార్టీ యూనిట్లు చేపట్టకపోవడం వల్లనూ;
  2. ముజఫర్పూర్ తీర్మానాన్ని అనుసరించి, పార్టీలో రహస్య విభాగాన్ని నిర్మించే విషయం విస్మరించడం మూలంగానూ;
  3. అన్నిటినీమించి పొలిట్బ్యూరో ఒక సమిష్టి శక్తిగా పనిచేయడం మానేసింది. పాలిటీబ్యూరోలో అత్యధికులు తమ తమ రాష్ట్రాలలో పనిచేస్తున్నారు. ఆరు వారాలకు లేదా నెలకొకసారి మాత్రం కలుసుకుంటున్నారు. అత్యవసర లేదా రోజువారి ఎదురయ్యే ఘటలనపై నిర్ణయాలు తీసుకుంటున్నారు. 1970 అనారోగ్యం తరువాత కామ్రేడ్ ఎం.బి కేంద్రం వదిలి, విజయవాడలో మకాం పెట్టారు. తన సలహాలు అందించడం, అభిప్రాయాలు చెప్పడం తప్ప, తన పి.సుందరయ్య.............

  • Title :Na Rajinama
  • Author :Comrade Gurram Kotaiah
  • Publisher :Comrade Gurram Kotaiah Memorail Kamiti
  • ISBN :MANIMN4541
  • Binding :Papar back
  • Published Date :July, 2022
  • Number Of Pages :160
  • Language :Telugu
  • Availability :instock