₹ 210
సామాజిక శాస్త్రంలో తన లోతైన పరిశోధనలతో ప్రభుత్వ విధివిధానాలను విస్తృతంగా ప్రభావితం చేసిన ప్రపంచ ప్రఖ్యాత మేధావి ప్రొఫెసర్ హనుమంతరావు గారు. ప్రజా భాగస్వామ్యం, ముఖ్యంగా అట్టడుగు అణగారిన వర్గాల భాగస్వామ్యం, వికేంద్రీకరణ, వ్యవస్థీకరణ, ప్రకృతితో సమతుల్య సంబంధాలు అనే మౌలిక విలువలతో కూడిన అభివృద్ధి నమూనా ద్వారానే పరిణితి చెందిన సామజిక, ఆర్ధిక మరియు రాజకీయ అభివృద్ధి సాధ్యం అవుతుందనేది శ్రీ రావు గారి అభిమతం. అభివృద్ధి నమూనాలో ప్రభుత్వానికి, ప్రైవేట్ రంగానికి, మార్కెట్ కి సముచిత ప్రాధాన్యతను నిర్దేశించే వీరి నిరంతర అంతర్గత మేధోమధన ప్రక్రియ ఈ పుస్తకంలో వ్యక్తమవుతుంది. ఈ ప్రక్రియ మార్కిజం నుండి నెహ్రు వాదానికి వీరి సుదీర్ఘ ప్రయాణానికి కారణమైనది. చిన్న రాష్ట్రాల ఏర్పాటు వాదం కూడా వీరి సుదీర్ఘ ప్రయాణంలో భాగమే.
-సి.హెచ్.హనుమంతరావు.
- Title :Naa Prayanam
- Author :Ch Hanumantha Rao
- Publisher :Navachetana Publications
- ISBN :MANIMN0615
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :284
- Language :Telugu
- Availability :outofstock