నా దేశం
ఆధ్యాత్మిక దాతగా వెలసింది.
శాంతి అహింసలు ప్రబోధించింది
వేదాంత శిరోమణి నా దేశం! అంటూ
భారతీయ సంస్కృతికి మూలభూతమైన వేదాల్ని వేద ధర్మాన్ని లోకంలో సూ ప్రతిష్ఠితం
చేయాలని కొనియాడుతూ -
సర్వ శాస్త్రాలు ఉదయించిన నేల
సమస్త విద్యలకు జన్మ ప్రదేశం
సకల కళలకు తల్లి మన భారతి
వేద అమృతం కురిసిన దేశం!
అని భారత మాత గొప్పతనాన్ని తన కవితల్లో పొందుపరిచారు. అంతలోనే.... అవతరించు దేవా
ధర్మాన్ని కాపాడే ప్రభువు!
అంటూ అలనాటి దేశ స్థితికి ప్రస్తుత పరిస్థితికి తల్లడిల్లిన వ్యక్తి. కవి వావిలి పల్లి
రాజారావు గారు. 'నా దేశం'
గేయం ద్వారా - నాగరికతలు పరిఢవిల్లే వేద జ్ఞానం వికసించే పురాణాలకు పుట్టినిల్లు సకల శాస్త్రాలకు పెన్నిధి! ధీర వనితల వీరగడ్డ బుద్దుడు మహావీరుడు బాపు
మునులు మహాత్ములెందరికో జన్మనిచ్చిన జగద్ధాత్రి!
అంటూ భారతదేశం సంస్కృతి యొక్క మహోన్నతను గూర్చి కొనియాడారు. వజ్ర భారతి కవితలో నాటి దేశభక్తులెక్కడా? నాటి సేవా తత్పరులు లేరీ అంటూ తన గోడును వెలిబుచ్చారు. నవ సమాజం అంటూ అపరిమిత స్వేచ్ఛను గూర్చి.............