• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Nadoori Midde

Nadoori Midde By Surendra Seelam

₹ 175

పల్లె గుండె చప్పుడుగా 'నడూరి మిద్దె'

---వెంకట్ శిద్దారెడ్డి

నేను ఒక మారుమూల పల్లెటూళ్లో పుట్టాను. అది ఇప్పటికీ మారుమూల పల్లెటూరులానే ఉంది. వాన పడితే ఇప్పటికీ మా ఊరికి బస్సు రాలేదు; రోడ్డుల పరిస్థితి అంత ఘోరంగా ఉంటుంది. చదువులకోసం చాలా చిన్నప్పుడే ఊరు వదిలేసి వెళ్లినా శెలవులకి వచ్చినప్పుడు ఊర్లో జరిగే విషయాలను కొంత గమనిస్తూనే ఉండేవాడిని. మా నాన్ననడిగి మా పూర్వీకుల గురించి తెలుసుకుంటూ ఉండేవాడిని. నేను ఎనిమిదో క్లాసికి వచ్చేవరకు కూడా మాది పూరిల్లు. ఊర్లో చాలామంది రెడ్లకు మిద్దెలుండేవి. మాది పెద్ద ధనవంతుల కుటుంబం కాకపోయినా మా తాతన్నా, మా నానన్నా ఊర్లో ఒక గౌరవం ఉండేది. ఎలక్షన్స్ అప్పుడు పోటీ చేసే ఎమ్మెల్యే క్యాండిడేట్లు మా ఇంటికే వచ్చేవాళ్ళు. ఊర్లో సర్పంచ్, పెద్దోళ్లు మీటింగ్కి మా అరుగు మీదకే వచ్చేవాళ్ళు. డబ్బులు, పరపతి లేని మా తాతకి ఇంత గౌరవం ఎందుకు అని చాలా సార్లు అనిపించేది. ఒకసారి మా అమ్మ కథంతా చెప్పింది. ఊర్లో మాల, మాదిగ వాళ్లకి మా తాతంటే ప్రేమ. మా కుటుంబమంటే ఇష్టం ఉండడం వల్ల, మా తాత చెప్పిన వాళ్లకి ఓట్లు వేస్తారని చెప్పింది. డబ్బులున్న వాళ్లం కాకపోయినా పేద ప్రజల సపోర్ట్ కూడగట్టుకున్నాడు మా తాత. అందుకు కారణం ఆయన ఒకప్పుడు కమ్యూనిస్ట్ జెండా పట్టి పేదల పక్షాన పోరాడాడు.

మా అమ్మ మరొక సంఘటన కూడా చెప్పింది. అప్పుడు నేనింకా చాలా చిన్న పిల్లాడిని. మా అత్తకు పెరాల్సిస్ ఎటాక్ వచ్చి మద్రాస్లో హాస్పిటల్లో చేర్పించారు. ఇంట్లో మా నాయనమ్మ దగ్గర నన్నొదిలేసి మా అమ్మ, నాన్న, తాత మద్రాస్ వెళ్లారు...............

  • Title :Nadoori Midde
  • Author :Surendra Seelam
  • Publisher :Anvikshiki Publications
  • ISBN :MANIMN5978
  • Binding :Paerback
  • Published Date :2024
  • Number Of Pages :142
  • Language :Telugu
  • Availability :instock