• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Naduri Rammohanrao 3 Anuvaada Kathalu

Naduri Rammohanrao 3 Anuvaada Kathalu By Naduri Rammohanrao

₹ 400

అరుణ వలయం

ఉపోద్ఘాతం

ముష్యూర్ పాలియూ జన్మదినం సరిగా ఆ సెప్టెంబరు 29వ తేదీన ఉండివుండక పోతే అరుణ వలయానికి సంబంధించిన ఈ నిగూఢ చరిత్ర ఏదీ జరగకపోయి ఉండును. ఒక డజనుమంది మృతవ్యక్తులు ఇప్పుడు నిక్షేపంగా జీవించివుండేవారు. థాలియా డ్రమండ్ అనే సుందరిని నిజాయితీపరుడైన ఒక పోలీసు ఇన్స్పెక్టర్ "ఈమె ఒక దొంగ, దొంగలతో కలిసి పనిచేసింది" అని వర్ణించి వుండేవాడు కాదు.

జన్మదిన సందర్భంలో ముష్యూర్ పాలియూ తన సహచరులు ముగ్గురికీ టులూజ్ నగరంలో విందు చేశాడు. కబుర్లతో కాలం గడిచిపోతోంది. తెల్లవారుజామున మూడుగంటల ప్రాంతంలో ముష్యూర్ పాలియూకు హఠాత్తుగా తాను టూలూజ్ నగరానికి ఎందుకు వచ్చిందీ జ్ఞాపకం వచ్చింది. లైట్ మన్ అనే ఇంగ్లీషు నేరస్థుని మరణదండన నిర్వహించడానికి అతడు పనిగట్టుకుని ఈ నగరం వచ్చాడు.

"ఇప్పుడు మూడుగంటలైంది. 'అరుణాదేవి'ని మనమింకా సిద్ధం చెయ్యనేలేదు" అన్నాడు ముష్యూర్ పాలియూ. మద్యపాన మహిమ వలన అతనికి మాటలు తడబడ్డాయి.

వెంటనే నలుగురూ లేచారు. కారాగృహానికి ఎదురుగా ఒక ట్రాలీవుంది. దానిమీద గిలటిన్ (మారణయంత్రం) భాగాలన్నీ విడివిడిగా అలాగే పడివున్నాయి. అలవాటైన చేతులు కనుక వారు అనాయాసంగా ఆ యంత్రభాగాలను, ఖడ్గాన్ని అమర్చారు.

గిలెటిన్ యంత్రం బాగా పనిచేసేదే అయినప్పటికీ దక్షిణ ఫ్రాన్స్లో లభ్యమయ్యే ఘాటైన మద్యప్రభావానికి అదీ లోను కాకపోలేదు. అందుచేత యంత్రం పనిచేస్తుందోలేదో పరీక్షించటానికి వారు ప్రయత్నించినప్పుడు ఖడ్గం పడవలసిన చోట పడనేలేదు.

"నేను చెప్తానాగండి" అని ముష్యూర్ పాలియూ గిలటిన్లో ఒక మేకు దిగగొట్టాడు. ఆ మేకు సరిగ్గా ఎక్కడ దిగబడగూడదో అక్కడ దిగబడింది.

వ్యవధిలేదు. సైనికులు వధ్యస్థానం సమీపించారు.......

నాలుగు గంటల తరువాత నిందితుణ్ణి కారాగృహం నుండి నడిపించుకు వచ్చారు. అప్పటికి నిందితుడి ఫొటో తీయటానికి వీలైనంత వెలుతురు వచ్చేసింది..... "ధైర్యంగా వుండు” అని ముష్యూర్ పాలియూ నిందితునితో మెల్లిగా అన్నాడు..................

  • Title :Naduri Rammohanrao 3 Anuvaada Kathalu
  • Author :Naduri Rammohanrao
  • Publisher :Spandana Publications
  • ISBN :MANIMN6028
  • Binding :Paerback
  • Published Date :Dec, 2024
  • Number Of Pages :290
  • Language :Telugu
  • Availability :instock