• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Nagamma
₹ 150

నాగమ్మ

కనగాల మసీదులో అజా వినబడి వినబడకముందే నిద్ర లేచింది నాగమ్మ. జేజి వాకిలూడుస్తోంది. ఎంకయ్య గిలకబావి దగ్గరకు కావిడేసుకెళ్లాడు. కుండలు సట్టులన్నీ బయటేసి నీళ్లు జల్లింది ఆదిమ్మ. పడ్డదూడ ముందు పేడ కళ్లు తీసి, దాన్ని సీమచింత చెట్టు కింద కట్టేసి నాలుగు ఎండు పరకలేసింది. కనువంతా ఊడ్చి కోళ్ల గంపల్లేపితే కోళ్లన్నీ కీకర బేకరంటూ రెక్కలు టపటప లాడిస్తూ కంపలంట, దొడ్డులంట పరిగెత్తినయి.

నాగమ్మ తోకల ఎంకటేసు ఇంటెనకున్న ఈతచెట్టుల దగ్గరకెళ్లింది. పండి రాలిన ఈత కాయలేరుకుందామని. అప్పటికే కిందపడ్డ పండిన ఈతకాయల్ని ఏరుకుని, గెడకర్రతో ఈతగెలల్లో పండిన కాయల్ని దులుపుతున్నాడు రాముడు.

ఈరమ్మ, ఎంకాయమ్మ ఈతకాయలు తింటూ - "ఆ పక్కనుండయి రా ఈ పక్కన సూడు" అని వాడికి చెబుతున్నారు. నాగమ్మ కొక్కకాయకూడా దొరకలేదు.

రాముడి గెడకర్ర లాక్కుంది. "ఇట్టాగంట్రా గెడపొట్టుకునేది? ఎదవనాయాలా! యిదిగో ఈ గెల్లో సూడు ఎన్నికాయలు పండినయ్యో గుడ్డినాయాలకి ఒక్కటీ కనబడలా" . - అంటూ గెడకర్రతో ఒక్క దులుపు దులిపేసరికి, బడబడమంటూ దోసెడు ఈతకాయలు రాలినయి.

అంతాకల్సి ఈతకాయలన్నీ ఏరుకున్నారు. కాయలు తిన్న తర్వాత గెడ కర్రకు కొంకె కట్టి "పిచ్చిమ్మ ఇంటెనక సీమసింతసెట్టు గుత్తులుగుత్తులు కాయలు కాసిందే కోసుకుందామా?" అంది నాగమ్మ.

"పిచ్చమ్మా?బూతులు తిట్టు వద్దులే" అంది ఈరమ్మ.

"నిన్నే పల్లికోన పోయిందిగా! ఇయ్యాలకూడా రాదు. నిన్న మా అమ్మతో సెబుతుంటే యిన్నా" అన్నాడు రాంగోడు. అంతాకల్సి పిచ్చమ్మ సీమసింతకాయల................

  • Title :Nagamma
  • Author :Dr Nakka Vijaya Ramarao
  • Publisher :Nandini Publications
  • ISBN :MANIMN3873
  • Binding :Papar back
  • Published Date :Jan, 2016
  • Number Of Pages :198
  • Language :Telugu
  • Availability :instock