అతను శివుడు కాదు.
అతనో రచయిత. అయినా విషం తీసుకోవలసి వచ్చింది.
చాలా కాలం క్రిందట విన్నాడు, పూర్వం ఎప్పుడో సాగర మథనం జరిగిందని. ఈ మథనానికి రెండు పక్షాలు వున్నాయట. ఒకళ్ళు దేవతలు, మరొకళ్ళు దానవులు. సాగర మథనం నుండి అమృతము, విషమూ కూడా ఇటీవల జరుగుతున్న నగర మథనంలో దేవతలు బయలు వెడలాయి.
ఎవరు, దానవులు ఎవరు అని నిర్ణయించడం కష్టమయిన పని. నగర మథనం ఎన్నో వస్తువులను ఉత్పత్తి చేసింది. అవన్నీ వీధుల్లోను, సందు గొందుల్లోను చెల్లా చెదరుగా పడి వున్నాయి.
కళ్ళకు సూర్యరశ్మికి బదులు అసూయ, అత్యాశ అగుపిస్తున్నాయి. నోట్లో మధురమయిన మాటలు పలికే నాలుకకు బదులుగా రెండు పక్కల పదును వున్న బాకులు కనిపిస్తున్నాయి. మాటలకు బదులు యీ టెలు అగు పడుతున్నాయి. చేతులకు బదులు బల్లేలు, కాళ్ళ స్థానంలో స్వార్థంలో మునిగిపోయిన గుంజలు కనిపిస్తున్నాయి. నగర మథనానికి యివన్నీ గుర్తులు. ఊపిరి పీల్చుకుందుకు లేకుండా అందరినీ నొక్కి పారేస్తున్నాయి, కాని యింకా చంపడం లేదు.
చాల రోజుల తరువాత యింటి నుండి బయటకు వచ్చాడు. ముందు వున్న వీధి రోదిస్తూ వుంది. కనికరం కోరుతూ వాదిస్తూ వుంది. దాని ఎముకలన్నీ బయట పడిపోయినాయి. దాని రంధ్రాలు విశాలంగా తెరుచుకున్నాయి. అంగాలన్నీ వూడి పడిపోయేట్లుగా వేలాడుతున్నాయి. వీధిని పోయేవాళ్ళు దాని గాయాలమీద అడుగులు వేయకుండా జాగ్రత్తగా నడుస్తున్నారు. వీధికి రెండు పక్కల వున్న యిల్లు దానిపైని విషాదం కుమ్మరిస్తున్నాయి.
ఏదో దభాలున చప్పుడయి అతను వెనక్కు తిరిగి వచ్చింది. ఓ యువతి అందమయిన పాదరక్షలు వేసుకుని చేతులకు పౌడర్ అలుముకుని సుతారంగా చక్కగా చూడవలసి ముఖము నడుస్తూ వీధిలో పడిపోయింది. తిరిగి తనంత తను పైకి లేవాలని ప్రయత్నం............