నగరంలో మరమానవి
సిమ్ సిటీ
సమీప భవిష్యత్తులో ఒక రాత్రి. కారు నేషనల్ హైవే నంబర్ 165 మీద విలాసంగా సున్నితంగా జారిపోయినట్లు పరుగెడుతోంది.
కళాధర్, కరిష్మా కారు వెనక సీటులో కూర్చున్నారు.
డ్రైవర్ లెస్ ఆటోమాటిక్ కారు అది. ప్రోగ్రాం చేయబడిన గమ్యానికి వెళ్ళి పోతుంది.
వాళిద్దరూ సంతోషంగా వున్నారు, తన్మయత్వంలో వున్నారు. చుట్టూ జరిగిపోయే దృశ్యాలు, చెట్లూ ట్రాఫిక్ తప్పించుకుని పోతున్న కారులో వాళ్ళకి కనబడటం లేదు.
కారణం... ప్రేమ.
ప్రేమ మానవులని మరో లోకంలోకి తీసుకువెళ్ళగలదు. ప్రేమ, మార్పు లేకుండా సాగిపోయే జీవితాన్ని ఒక్కసారి రాగరంజితం చేయగలదు.
అది సెక్స్ కాదు, కోరిక కాదు, కామం కాదు.
ప్రేమిస్తున్న మనిషి దగ్గర వున్నప్పుడు వచ్చే అద్భుతమైన సైన్సుకి అర్థం...............................