అశ్వనీ నక్షత్రము
అశ్వనీ నక్షత్రము, నక్షత్రములోకెల్లా మొదటిదిగా పేర్కొనబడి నది. వేదములందు మాత్రము మొదటిదిగా కృత్తికా నక్షత్రమును చెప్పి నప్పటికీ, భచక్ర నిర్మాణమునకు (జ్యోతిషశ్శాస్త్రమునందు) మూలమైనది. ముఖ్యముగా చాంద్రమానీ యులకు ప్రతివత్సరారంభ కారణమైనది. ఈ నక్షత్రమే కావటము వలన ఇదియే ప్రారంభ నక్షత్రముగా చెప్పటం యుక్తంగా వుంటుంది.
ఈ నక్షత్రము నలుపువర్ణముగల్గి గుర్రపుముఖమువలెనున్న మూడు నక్షత్రముల సమిష్టి స్వరూపంగా ఆకాశంలో కనిపిస్తుంది. దేవగణమునకు జెంది అశ్వయోనిగల పురుష నక్షత్రము. ఈ తారకు అశ్వనీదేవతలు, అధికారులు (దేవతలు) వైశ్యజాతికి జెందినది. మందగించిన దృష్టికలుగి క్రిందికిచూచుచూ నాలుగు పాదములతో అతి తొందరగా నడవగల నక్షత్రము అశ్వని. ఇది వాయుమండలము నకు జెంది యున్నది. వెలుపలివైపు, పట్టణములందు స్థానబలము కలిగి వుంటుంది. ఈ నక్షత్రములోనే అశ్వద్ధామ జన్మించి సప్త చిరంజీవులలో నొకడుగా ప్రసిద్ధి వహించియున్నాడు.
జనన ఫలితాలు : అశ్వనీ నక్షత్రములో పుట్టినవారు, విశాలమైన రొమ్ములు, పొడుగైన బాహువులు, అందమైన కన్నులు, చిన్నముక్కు, స్థూలమైన శరీరముకలిగి చూడటానికి చాలా ముచ్చటగా వుంటారు. వీరిది చాలా అందమైన ముఖము. సర్వజన ప్రియత్వము, వీరి కుంటుంది, ప్రతికార్యమునందు చొరవ, కార్యసాధనకు కావలసిన ప్రజ్ఞ వీరిలో మూర్తిభవించియుంటవి. ఆలోచనా పటిమ అధికము.
విద్యా వ్యాసంగములయదంఉ రాణించి పాండిత్యము, వినయము, సమర్ధత్వము, కీర్తి, సభాపూజ్యతగలవారగుదురు. రాజాదరణ లభింప గలదు. గొప్ప ప్రభుత్వ పదవులు నిర్వహింపుచు కొదవలేని భోగభాగ్యా దులు కలిగి వుండగలరు.
వీరికి మధ్య జీవితమునందు దుర్జన సహవాసములు సంప్రాప్తింప గలవు. ధనలోభత్వము, కడుచంచలత్వము వీరికుంటుంది. నడకయందు వేగము, మాటల యందు పొందిక, సాహసగుణములు, చంచలములైన సుఖభోగాదలు కలుగగలవు.
ఈ నక్షత్రము యొక్క మొదటి పాదమునకు తస్కరాంశయని పేరు. ఈ అంశయదంట జన్మించినవారికి పైగుణములతోబాటుగా. అఖండ వైభవము, గ్రామాధికారము, భోగము, కాఠిన్యము, సరస్త్రీ సాంగత్యము, చోరబుద్ధి, భూలాభము, శౌర్యము కలుగగలవు.
రెండవ పాదమునకు భోగ్యాంశయిన పేరు. ఇందుజన్మించిన వారు ధర్మపరులు, వినయశీలాది గుణములు గలవారు. గృహ వాహన సౌఖ్యములు పొందువారు. అనుకూల కళత్రపుత్రభాగ్యములు గలవారునగుదురు. వీరి యందాకర్షణ అధికము. ధనధాన్య సంపదలు వృద్ధిగలవారై నిత్యసౌఖ్యవంతులు కాగలరు.................