దేశమే గతి బాగుపడునోయ్
ఆ వూరి పేరు విజయనగరం. అక్కడ ఎత్తైన మహారాజుగారి దుర్భేద్యమైన కోట వుండొచ్చేమో గాని అంతకు మించి అదేమీ గొప్ప మహానగరం కాదు.
గంటస్తంభం, బంకులదిబ్బ, అయ్యగారి కోనేరు గట్టు ఇలా, ఇంకా అందరికీ అలవాటైన ప్రదేశాలు ఎప్పట్నించో అలాగా చెక్కు చెదరకుండా వుంటే వుండొచ్చు కాని, ఆ ఊరికి పేరు ప్రఖ్యాతలు ఎమన్నా వచ్చాయంటే ఆనాటి రాజు గారి ప్రతాపం గాని, ఆ ఎత్తైన కోట గోడల్ని చూసి గాని, ఇప్పటి ప్రజా ప్రభుత్వాల పనికిమాలిన పథకాలు చూసిగాని కాదు. ఏమన్నా ఆ వూరికి పరువు, ప్రతిష్ట ఇంకా మిగిలి చెక్కు చెదరకుండా వుందంటే, ఇంకా పలువురి నోట మెప్పు పొందుతుందంటే, ఆ గడ్డ మీద పుట్టిన మహానుబావులు, కళాకారులు, గాయకులు, కవులు, పండితులే కారణజన్ములు. ఆ వాసనలింకా జీవించే వున్నాయి. ఆ పరిమళాలింకా విస్తరిస్తూనే వున్నాయి. అందుకే విజయనగరమంటే ఇప్పటికీ... ఎప్పటికీ గురుతుల్యమైన భావన, ఆపేక్ష, అభిమానం కనబడుతోంది.
ఆ వూరికి పడమటివైపునున్న వీధిలో కూలీనాలీ చేసుకుంటూ రోజువారి బతుకును ఈడ్చేవారున్నారు. వాళ్ళల్లో ఏ రోజుకారోజు బ్రతుకు జీవుడా అని అత్తెసరుతో సర్దుకుపోయేవాడు జగ్గుబాయి. ఆ రోజు వాడి మూడు చక్రాలబండిని బైటికి తీసాడు. బ్రతుకు తెరువుకు సాధనం అది. రిక్షా లాంటి బండిలో పాత................
నాకు నచ్చిన నా కథ - 2