పాద ముద్రలు
అమరజ్యోతి
'విజేతలు భిన్నమైన పనులు చెయ్యరు.. వారు భిన్నంగా పని చేస్తారు' అని ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుడెవరో చెప్పాడు.
ఆ విషయం జ్ఞాపకమొచ్చింది ఉషకు.
ఆ పుస్తకాన్ని ఏడేండ్లక్రితం చదివినప్పుడు తను ఆ స్టేట్మెంట్ను అంగీకరించలేకపోయింది. దాంట్లో చిన్న కీలకమైన మార్పును చేసి తనకు అన్వయింపజేసుకుని.. ఆచరించి విజయాన్ని సాధించింది తను.
తను చేసుకున్న మార్పేమిటంటే..' విజేతలు ప్రతి సందర్భాన్నీ సరిగ్గా అర్థం చేసుకుంటారు.. భిన్నంగా ఆలోచిస్తారు.. భిన్నంగా పరిష్కారాలను కనుక్కుని విభిన్నంగా వాటిని అమల్లో పెడ్తూ ఆచరిస్తారు. అంతిమంగా తప్పక విజయం సాధిస్తారు 'అని. ఐతే దేన్నయితే తను విజయం అని భావించి ఈ ఉద్యోగం చేస్తున్న రెండేండ్ల నుండీ అనుకుంటోందో.. అది తప్పనీ.. విజయమంటే కేవలం ఉన్నతమైన ఉద్యోగాన్ని సంపాదించడం.. బాగా డబ్బు సంపాదించడం మాత్రమే కాదనీ.. అర్థమౌతున్న కొద్దీ.. ఏదో వెలితి.. ఏదో ఘర్షణ.. ఏదో అసంతృప్తి.. లోలోపల ఏదో ఖాళీ. ఏమిటా ఖాళీ.. ఎందుకా ఖాళీ...
నిన్ననే కాగ్నిజెంట్ టెక్నాలజీలోని తన అనలిస్ట్ ఉద్యోగానికి రాజీనామా చేసిన విషయం గుర్తొచ్చింది ఉషకు.
తన పై అధికారి సీనియర్ 'అనలిస్ట్.. చోళన్' అన్నాడు. “ఉషా.. తప్పు నిర్ణయం తీసుకుంటున్నావేమో.. ఆలోచించు.. మంచి ఉద్యోగం.. మన జీతం.. మంచి కంపనీ.. కంపనీ వల్ల మనకు మంచి గౌరవం.. థింక" అని............
-నాకు నచ్చిన నా కథ - 4.