మరేంలేదులే
నిన్నటి వరకూ
నీతో కలగలిసి తిరిగిన వాడు
నిను వీడి తన చోటుకు
తిరుగు పయనమైపోవడం
మరణమంటే మరేం లేదు.
డబుల్ కాట్ పక్కపై
ఉండీ లేనట్లు
పక్కనే నిద్రిస్తున్న తోడు
లేనీ లేనట్లు లేచివెళ్లడం
ఎప్పుడో ఒకప్పుడు
నడిచే దారిలో దొరికిన నాణెంలా
కనిపించి పలకరిస్తాడన్న
ఆశ లేకపోవడం
చుక్క తెగి పడ్డట్టు
ఏదో ఒకరోజు ఇంటి తలుపు మీద
తడి చప్పుడు చేస్తే...............................