సాహిత్య భ్రమరం
ఆ మధ్య విశాఖపట్టణంలో జరిగిన ఒక బాలసాహిత్యం వర్క్ షాపుకి వెళ్ళినప్పుడు వెంకట నారాయణ పరిచయమయ్యాడు. పరిచయమంటే మామూలుగా కుశలప్రశ్నలు అడగడమో, తీరిగ్గా, నింపాదిగా విశేషాలు తెలుసుకోవడమో కాదు, ఆ ఉన్న కొద్ది సేపట్లోనూ నాతో ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉండాలనీ, సాహిత్యం గురించి తనకి ఉన్న అనేక అభిప్రాయాలూ, ప్రశ్నలూ, ఆశ్చర్యార్థకాలూ అన్నీ అక్కడికక్కడే అప్పటికప్పుడే నాతో పంచుకోవాలనీ, ఓ! చెప్పలేనంత ఆతృత, దాహం కనిపించింది అతడిలో.
సరిగ్గా నా రాజమండ్రి రోజుల్లో నేనట్లానే ఉండేవాణ్ణి. ఎవరేనా కవి, రచయిత,......................