నల్లతాచు
తేది : 19-09-1985
సి.ఐ.ఏ. డైరక్టర్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ కనులకు మాత్రమే మిస్టర్ ప్రెసిడెంట్
బిలియాలోని మైక్రో ప్రాజెక్ట్ తయారవుతున్న ఓ మారణాయుధం గురించి నాకు అందిన సమాచారాన్ని ఈ లేఖతో జత చేస్తున్నాను.
ఆ రిపోర్ట్ మీద మీ అభిప్రాయాలతోపాటు తగిన సూచనలు, ఉత్తర్వులు మీ నుంచి లభిస్తాయని ఆశిస్తున్నాను.
విశ్వాసపాత్రుడు
సి.ఐ.ఏ. డైరక్టర్
4403 69056
ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బలంగా నిట్టూర్చాడు. అతని
ముక్కు పుటాలు వుబ్బాయి. "మైక్రో ప్రాజెక్ట్!” సన్నగా గొణుక్కున్నాడు.
తలదించి పై కాగితాన్ని మడిచాడు ప్రెసిడెంట్! క్రిందవుంది స్పెషల్ రిపోర్ట్! దానిపైన పెద్ద అక్షరాలతో వ్రాసివుంది.
"సి.ఐ.ఏ. డైరక్టర్ కనులకు మాత్రమే!”
"మైడియర్ రిచర్డ్....
రోజు రోజుకీ రష్యా తన ఆయుధ సామాగ్రిని, యుద్ధ పరికరాలను అభివృద్ధి పరచుకుంటోంది. అందుకు నిదర్శనమే రష్యా కమ్యూనిస్ట్ ప్రభుత్వం బిలియార్డ్స్ దగ్గర మైక్రో ప్రాజెక్టుని చేపట్టడం. ఆ ప్రాజెక్టు గురించి నేను రష్యన్ని అయివుండీ కూడా దర్యాప్తు చెయ్యడం చాలా కష్టమయింది. ఎంతో కష్టపడి దర్యాప్తు చేస్తే మనకు షాక్ కలిగించే ఎన్నో నిజాలు వెలుగులోకి వచ్చాయి..............