కథలతో సినిమాకి 'వంతెన' కడ్తున్న కథకుడు
To live is to have a story to tell.
కథలు మన జీవితంలో ఒక భాగం. ఒక మంచి కథకు జీవితాన్ని మార్చే శక్తి ఉంటుంది. లిపి లేని కాలం నుండి మనకు కథలున్నాయి. శతాబ్దాలుగా రచయితలు తమ ఊహాశక్తికి సృజనాత్మకతను జోడించి వినోదాన్ని, విజ్ఞానాన్ని అందిస్తూనే స్ఫూర్తి కలిగించే ఎన్నో రచనలు చేశారు.
కాలక్రమంలో వినోదాన్ని అందించే ఇతర సాధనాలు అందుబాటులోకి రావడం మొదలైంది; అందులో భాగంగానే పుస్తక పఠనం రానురానూ తగ్గుముఖం పడుతూ వచ్చింది. అదీకాకుండా మన విద్యావిధానం ఎక్కువ శాతం ఆంగ్లమాధ్యమంలోకి మారిపోవడంతో తెలుగులో చదవడం తగ్గిపోయింది. రాసేవాళ్ళు తగ్గిపోయారు.
చదువుకోవడానికి ఒక మంచి పుస్తకం దొరికితే చాలని లైబ్రరీల చుట్టూ, బుక్ రెంటల్ షాపుల చుట్టూ తిరిగిన అనుభవం నాది. అలాంటి రోజుల్నుంచి, కేవలం మూడు దశాబ్దాల కాలంలోనే "ఈ రోజుల్లో పుస్తకాలు చదివేవారున్నారా?” అని ఆశ్చర్యంగా అడిగే పరిస్థితుల్లో ఇప్పుడు మనమున్నాం. ఇలాంటివి విన్నప్పుడల్లా నా.....................