జననం, విద్యాభ్యాసం
మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ 15 జనవరి, 1929న జార్జియాలోని అట్లాంటాలో జన్మించాడు. అతని తండ్రి రెవరెండ్ మార్టిన్ లూథర్ కింగ్ సీనియర్, తల్లి అల్బర్టా విలియమ్స్ కింగ్. కింగ్, విలియమ్స్ కుటుంబాలు గ్రామీణ జార్జియాకి చెందినవి. మార్టిన్ జూ. తాతగారైన ఏ.డి. విలియమ్స్ గ్రామీణ మత బోధకునిగా చాలా ఏళ్ళు పని చేసి 1893లో అట్లాంటాకి వెళ్ళాడు. సుమారు 13 మంది సభ్యులతో ఉనికి కోసం కొట్టుమిట్టాడుతున్న అక్కడి చిన్న ఎబెనేజర్ బాప్టిస్ట్ చర్చికి అతడు బాధ్యత తీసుకుని దాన్నొక బలమైన కూటమిగా అభివృద్ధి చేశాడు. అతడు జెన్నీ సెలెస్తే పార్కసిని పెళ్ళాడాడు. ఆ దంపతుల సంతానంలో బతికి బట్ట కట్టిన పిల్ల అల్బర్టా. భూమిని కౌలుకి తీసుకుని సాగు చేసే ఒక పేద కుటుంబంలోంచి వచ్చిన మైఖేల్ కింగ్ సీనియర్ ఎనిమిదేళ్ళ పాటు అల్బర్టాతో ప్రేమ వ్యవహారం నడిపి చివరికి 1926లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కొత్త దంపతులు బతుకుదెరువు కోసం అట్లాంటా వచ్చి ఏ.డి. విలియమ్స్ ఇంటిలోనే నివాసముండసాగారు.
తన మామగారు చనిపోయాక, 1931లో మైఖేల్ కింగ్ సీనియర్ ఎబెనేజర్ బాప్టిస్ట్ చర్చికి పాస్టర్గా పదవి స్వీకరించాడు. సుశిక్షిత మత ప్రబోధకుని (మినిస్టర్)గా అందరి మన్ననలు అందుకున్న అతడు అనంతర కాలంలో జర్మన్ ప్రొటెస్టెంట్ లీడర్ మార్టిన్.............
..........................ఆడెపు లక్ష్మీపతి