• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Nalo Unna Prema

Nalo Unna Prema By Swapna Priya Ganji

₹ 200

వాష్రూమ్లో వున్న అద్దంలో నా అవతారం చూసి అసలిది నేనేనా అని ఆశ్చర్యమేసింది. రాత్రంతా బస్సులో ఏడ్వడం వల్లేమో కళ్ళు ఉబ్బిపోయాయి. అమ్మ నాన్న అన్న మాటలే మళ్ళీ మళ్ళీ ఒక్కొక్కటిగా మెదడుని తొలుస్తున్నాయ్. నువ్వు విజయ్ మాటెత్తావంటే ఇక ఇంటి గుమ్మం తొక్కొద్దని అమ్మ వార్నింగ్. నాన్నైతే, "పెళ్ళి సంగతి మాకొదిలేయ్, నీకసలేం తెలుసు, నువ్వు చూసిన ప్రపంచం చాలా చిన్నది" అంటూ మందలించారు.

"ఇది అయ్యేపనిలా లేదు, అమ్మావాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఇక్కడితో మన ప్రేమ విషయం మరచిపోదాం" అని ఇప్పుడు విజయ్ చెప్పాలి. కానీ తన మొహం చూస్తూ మాట్లాడగల, అక్కడ జరిగినదంతా చెప్పగలనా? ఏం చెప్పాలి, ఎంత చెప్పాలి, ఎలా చెప్పాలి ఏం అర్థం కావట్లేదు. కానీ విజయ్ నాకోసం బయట వెయిట్ చేస్తూ వుంటాడన్న సృహతో, మొహం కడుక్కుని, ఫ్రెష్ అయ్యి, బయటికివచ్చాను. కళ్ళు తనకోసం వెతుకుతున్నాయి.

విజయ్ ఇక్కడున్నానంటూ చేతితో సైగ చేసాడు. “ఫస్ట్ వేడి వేడిగా టీ తాగు. బ్రేక్ఫాస్ట్ వచ్చినప్పుడు వస్తుంది" అన్నాడు. తుఫానుకి ముందు ప్రశాంతతలా ఉంది మా ఇద్దరి మధ్య, మాట్లాడానికి ఏమీలేనట్లు. కామ్ టీ తాగుతుండగా, నా పక్కన వచ్చి కూర్చున్నాడు. నాకు బాగా గుర్తు నేను తన ప్రేమను అంగీకరించిన రోజు, ఉగాదినాడు కూడా ఇలాగే కూర్చున్నాడు నా పక్కనే. మళ్ళీ ఇన్నాళ్ళకు ఇవాళ, మా బ్రేకప్ డే స్పెషలనుకోవాలేమో. విపరీతమైన బాధ, మాటలు రావట్లేదు. మాట్లాడితే ఇందాక బస్టాండ్లో తనని పట్టుకుని ఏడ్చినట్లు, మళ్ళీ ఏడ్చేస్తానేమోనని భయంగా ఉంది. కానీ ఇక విజయ్ ముందు ఏడవకూడదని నాకు నేను మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాను. ఇలా ఏడుస్తూ తనతో బ్రేకప్ చెప్తే ఒప్పుకోడు. లేదా వెళ్ళి మా అమ్మావాళ్ళతో మాట్లాడతానంటాడు. వాళ్ళు తనతో ఎలా ప్రవర్తిస్తారో, ఎలా...................

  • Title :Nalo Unna Prema
  • Author :Swapna Priya Ganji
  • Publisher :Anvikshiki Publishers
  • ISBN :MANIMN5573
  • Binding :Papar Back
  • Published Date :2024
  • Number Of Pages :187
  • Language :Telugu
  • Availability :instock