నాలో నువ్వు
నిరంతరం రగిలే ఆవేశానివి
నరనరాన ప్రవహించే ఆవేదనవు
మనసు గొంతులో ధ్వనించే ఆందోళనవు |
ప్రతి అక్షరంలో కూర్చునే ఆలోచనవు
నాలో నువ్వు
సమస్త మానవ జాతివి
చరాచర జీవ కోటివి
తత్వానివి - సత్వానివి
ప్రణయానివి - ప్రళయానివి
నన్ను నడిపే చుక్కానివి!
మనసు మాటలు
గుండె దరువులు
కలహంసలు
నా ముఖ పుస్తక స్నేహితులు................