• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Nalugu Kalla Mandapam

Nalugu Kalla Mandapam By Madhurantakam Narendra

₹ 250

కాకులు - గ్రద్దలు

"నువ్వీడ కొలువుదీరి కూర్చోనుండావా సామీ! గంట సేపుణ్నించీ యెతకతా వుండాను. యెక్కడా కనబడకపోయే టప్పటికి, అడివికి రాకుండా, యింట్లోనే కాళ్లు జాపేసినా వేమోనని అనుకుంటిని," అన్నాడు మునస్వామి, చెట్టు నీడలోని రాతిపైన కూర్చుంటూ.
 

వేపచెట్టు మొదలునానుకుని కూర్చున్న తిరిపాలు, గొర్రె పిల్ల నోటికి లేత కొమ్మల్ని అందించుతూ, “కాళ్లు బార్లాజాపేస్తే నాకెట్లా గడుస్తాది మామా! నీమాదిరిగా నేనేమయినా గవర్మెంటు వుద్దోగం చేస్తావుండానా యేమి?" అంటూ కిసుక్కుమని నవ్వేశాడు.

అతడి మాటలు చెవిని బడనట్టుగా, చెమటతో తడిసిన ముఖాన్ని టవలుతో తుడుచుకోసాగాడు మునస్వామి. తరువాత చొక్కా బొత్తాలు విప్పుకుని, టవలుతో విసురుకోసాగాడు. చాలనిదానికి 'వుఫ్ వుఫ్' అని నోటితో గాలిని వూదుకోసాగాడు. కొంచెం కుదుటపడిన తరువాత, “యీ సమత్సరం యెండలు పోయిన తడవకంటే ఎక్కువగా వుండాయి...” అంటూ చుట్టూ అడవికేసి కలయజూశాడు.

సూర్యుడు నడినెత్తిపైకి రావడంతో నీడలన్నీ చెట్లకిందే నక్కి కూచున్నాయి. పచ్చనిచెట్టు మచ్చుకైనా కనిపించని పాలకొండలు యెండ ధాటికి శోషాచ్చి పడిపోయిన యేనుగుల గుంపులా కనిపిస్తున్నాయి. దూరంగా కొండరాజు కోనలో సగానికి పైగా యెండిపోయిన చెట్లే కనిపిస్తున్నాయి...........................

  • Title :Nalugu Kalla Mandapam
  • Author :Madhurantakam Narendra
  • Publisher :Vijayavani Printers
  • ISBN :MANIMN6096
  • Binding :Papar Back
  • Published Date :Jan 2025 2nd print
  • Number Of Pages :249
  • Language :Telugu
  • Availability :instock