• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Nama Vignanamu
₹ 200

నామ విజ్ఞాన పరిచయం

నామాలను గూర్చి అధ్యయనం గావించేది గనుక. యిది నామ విజ్ఞానము. నామ మంటే పేరు అని తెలిసిందే. ఈ పేరు వ్యక్తులది గావచ్చు, చెట్లు, పుట్టలు, జంతువులు, గ్రామాలు, వస్తువులు - ఇలా - దేనిదయినా గావచ్చు. అయితే సాధారణంగా నామమనే పదం వ్యక్తులకు పరిమితమైనదిగా భావిస్తాము. కాని పై వాటికి కూడా వర్తిస్తుంది. ఇలా అన్ని నామాలను - అంటే పేర్లను గూర్చి చర్చించేది నామవిజ్ఞానశాస్త్రం.

సాధారణంగా పేర్లను నామవాచకాలని, వాటికి బదులుగా ఉపయోగించే పదాలను సర్వనామాలని, అంటాము. భాష గూర్చి - అంటే భాషాసమష్టిలోని పదజాలాన్ని గూర్చి బోధించే సందర్భంలో, భాషా సమష్టిని అయిదు వర్గాలుగా విభజించి బోధించడం జరుగుతుంది. అవి నామవాచకాలు, సర్వనామాలు, క్రియలు, విశేషణాలు, అవ్యయాలు. నామవాచకాలు అంటే పేర్లని, సర్వనామాలు అంటే నామవాచక శబ్దాలను ఉపయోగింపవలసిన సందర్భంలో, ఆ శబ్దాలకు మారుగా, ఉపయోగించే శబ్దాలని చెపుతాము. క్రియలు అంటే చేస్తున్న పనిని నిర్దేశించే పదంగా చెపుతాము. విశేషణాలంటే, నామవాచకాల గుణాన్ని తెలియపరచే పదాలని చెప్పడం జరుగుతుంది. ఇక అవ్యయాలంటే పై వాటిలో చేరని, అంటే అభిప్రాయాలను వ్యక్తపరిచే పదజాలం. ఆహా, ఓహో, ఔరా, సుమా మొదలైనవని చెపుతాం. స్థూలంగా పై వానిని అలా నిర్వచిస్తాం. నిర్దేశిస్తాం. ఇది సాధారణం. ఆ వింగడింపు, విద్యార్థికి, బాషపట్ల, భాషలో ఉపయోగించే పదాలపట్ల, ఉపయోగంలో ఆ పదాలు నిర్వర్తించే వ్యాపారం పట్ల స్పష్టమైన అవగాహన కొరకు చేస్తున్నది అది చాల అవసరం కూడా!

నామవిజ్ఞానం దృష్టిలో, ఈ వింగడింపు లేదు. దాని దృష్టిలో భాష లోని పదజాలమంతా ఒకటే. అవి పేర్లు. ఇది కొంత వింతగా అనిపిస్తుంది. సందేహానికి గురిచేస్తుంది.......................

  • Title :Nama Vignanamu
  • Author :Acharya Yarlagadda Balagangadhararao
  • Publisher :Nirmala Publications
  • ISBN :MANIMN5784
  • Binding :Papar Back
  • Published Date :Nov, 2022
  • Number Of Pages :286
  • Language :Telugu
  • Availability :instock