₹ 200
అర్ధ స్ఫూర్తి తో చేసే అనుష్ఠానం సార్ధకతని సంతరించి, కృతకృత్యుల్ని చేస్తుంది. తన సాధనకు ధ్యనం చేసుకొనేందుకు రుద్ర నమక చమకాలను భాష్య సహితంగా అధ్యయనం చేసి, ఈ గ్రంధాన్ని రూపొందించిన శివార్చనాపరులు డా. తాడేపల్లి పతంజలి గారు దాని ద్వారా అక్షరమతో రుద్రాభిషేకం చేశారు.
అర్ధ - తాత్పర్య - విశేషములు ... అనే విభాగాలతో రుద్ర మంత్రాలను యధోచితంగా చక్కని తెలుగులో అందించారు. అతివిస్తారము, అతిక్లుప్త లేకుండా, జిజ్ఞాసువులకు సుబోధకమయ్యేలా సరళ సుందరంగా రచించిన తీరు అభినందనీయం. వీరికి నా పై ఉన్న ఆత్మీయతాభావానికి బహుధా ధన్యవాదాలు.
రచించేటప్పుడు తాను చేసిన అధ్యయనం, అవగాహనా ఒక సాధన అయితే, అది తోటి సాధకులకు ప్రయోజనకారిగా అందించడం మరొక ప్రత్యేక వరివస్య.
- డా. తాడేపల్లి పతంజలి.
- Title :Namaka Chamakalu
- Author :D Tadepalli Pathanjali
- Publisher :Gudipati SriRamakrishna
- ISBN :MANIMN0623
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :246
- Language :Telugu
- Availability :instock