ఇందులో పుస్తకమునకు ఒక వైపు అంతరాత్మ అర్ధ భాగం, మరో అర్ధ భాగం నందిగ్రామ రాజ్యం కలదు
1వ రేకు
జాము ప్రొద్దెక్కక ముందే బడికి బోవు బాలుర నుదురులు చెమర్చుచున్న వసంత భానుడు రాబోవు గ్రీష్మమున నెంత తీక్షుడగునో ఆ లేయెండలకు గోరువెచ్చనయ్యు చల్లదనమునే ప్రకటించు సముద్రపు వాయువులలో ఆ బైక్షుక దంపతుల కంఠస్వరము విలీనమగుచున్నది. ఆ రాజ మార్గమంతయు నా = దంపతుల మసృణ గాన మాధుర్య వాహినిచే చిలువలెత్తినది. ఆ పేద దంపతులు * ప్రతి వాక్కునందును ప్రకృతి యానందపు మ్రుగ్గులు పెట్టికొన్నది. అందు భర్తకు - ముప్పది యేండ్లు. నల్లని వాడు. కొంచెము స్థూలకాయుడు. నిరంతర క్షుధాపీడితమై ద చిక్కియున్న దేహమును, నకనకలాడు కడుపును, ఇవి పేదరిక మాతని మీద * శాశ్వతముగా నుంచిన చిహ్నములు. అతని భార్య కిరువది యేండ్లు దాటవు. దేహచ్ఛాయ కొంచెమెఱుపు. పలుచనైన యామె దేహ మామె పొందు కష్టముల చిహ్నములు నిల్పుకొనలేక పోయినది. ఆమె కంఠమునందు నెత్తురు చార లగుపడుచున్నవి. మొగమున వెడల్పుగా పెట్టిన కుంకుమ తిలకము ఆయమ విలాసమైన ముఖ రేఖలకు పవిత్రత దెచ్చినది. ఇరువురు ధరించినవియు చినుగు పుట్టములే. వారి దాంపత్యము భగవంతుడు సమకూర్చి నందులకు, వారి కంఠ మాధుర్యము లొకదానిలో నొకడు లీనమై జగజ్జనని శారదా ప్రథమ స్తన స్రుత క్షీర - వాహినీ తరంగములపై తేలియాడుటకును సరిపోయినది. ఆ పేద పుణ్య దంపతులు జ: పార్వతీ శంకరులు వలె బందరు పేటలందు దిరుగుచు పంతులు గారి మేడ వద్ద నుండి బుట్టయ్యపేట సీతారామస్వామి యాలయాభిముఖులై పోవుచుండిరి. రెండు వైపుల నున్న యిండ్ల నుండి పుణ్య గేహినులు దోసెళ్ళతో త్రవ్వి బియ్యము వారి యెడులలో పోయుచున్నారు. మహా కవుల సంగతిచే మాధుర్య సీమాంచలము లెరిగిన యొక భిషక్కు వారి గీతికా మాధుర్యమునకు ముగ్ధుడు కాలేదో. నవ కుసుమ విహరమాణ భ్రమర కిశోర సదృశుడగుకవి గాయకుడు రస తన్మయత ననుభవించలేదో, జగన్నాయకుడు జనకజా మనోహారిసీతారామస్వామి యొడలు భక్తుని యీ మధుర గీతికలలకు పులకరించలేదో, బడికిపోవు బాలులెల్లరు...............