₹ 100
ఇంటికి దీపం ఇల్లలంటారు . ఇరవయ్యవ శతాబ్దం ప్రధమార్ధంలోనే భారతీయ జనాభాలో ఏభైశాతానికి పైగా స్త్రీలుండటంతో, మహాత్మ గాంధీ గారు ఒక స్త్రీ విద్యావంతురాలైతే ఆ కుటుంబమంతా విద్యావంతులవుతారు అని యావత్భారతావని సమగ్రాభిద్దికి స్త్రీ విద్యను ప్రోత్సహిస్తూ ఒక స్త్రీ విద్యావంతురాలైతే అటు పుట్టింటిని - ఇటు మెట్టింటిని విద్యావంతమైన కుటుంబంగా మార్చుతుందని దేశవ్యాప్తంగా స్త్రీ విద్యను ప్రోత్సహిస్తున్నారు.
మన ఆంధ్రావనిలో వనితామణులు రచన వ్యాసంగంలో అత్యంత ప్రతిభను చూపుతూ వచ్చారు. రెండు దశాబ్దాలపాటు రాయం ఏలారు. ఏ పత్రిక చూసినా స్త్రీ రచనలే కనిపించేవి. రచన చేయడానికి డిగ్రీలు అవసరం లేదు. సంఘం పట్ల సమాజంలో జరిగే వివిధ విషయాల పట్ల అవగాహనా వుండటం. ప్రతి సంఘటనను ఆకళింపు చేసుకోవడం, స్పందించడం వల్ల రచనలు చేయవచ్చునని నిరూపించారు.
- Title :Nandini
- Author :Gangapatnam Devaki Reddy
- Publisher :Gangapatnam Devaki Reddy
- ISBN :MANIMN1019
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :120
- Language :Telugu
- Availability :instock