• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Narada Maharshi

Narada Maharshi By Vakkantam Suryanarayanarao

₹ 250

నారద మహర్షి 

దర్భాసనం మీద కూర్చొని, కళ్ళు అరమూసి, ధ్యానంలో ఉన్న నిగమానంద అడుగుల చప్పుడు విని, కళ్ళు తెరిచాడు. ఎదురుగా నిలుచుని, వినయంతో నమస్కరిస్తున్న శిష్యుల్ని చిరునవ్వుతో చూశాడు.

'ఆనందమస్తు!' చెయ్యెత్తి దీవిస్తూ అన్నాడు నిగమానంద. కూర్చోమన్నట్టు సైగ చేశాడు.

శిష్యులు ముగ్గురూ కూర్చున్నారు. "గురువు గారూ, చాలా రోజులుగా ఒక ప్రశ్న అడగాలను కుంటున్నాను..." వినయుడు అన్నాడు.

“అనుకున్నది అనాలి. అడగాలనుకున్నది అడగాలి!” నిగమానంద నవ్వుతూ అన్నాడు.

“ఎవరికి నమస్కరించినా ఆయురారోగ్యాలూ, ఐశ్వర్యాలు కలగాలంటూ దీవిస్తారు. మీరెప్పుడూ 'ఆనందమస్తు' అంటూ ఆనందం కలగాలని దీవిస్తారు. ఎందుకో తెలుసుకోవాలనుంది".

"నీ ప్రశ్నకు సమాధానం కనుక్కోవడం చాలా సులభం వినయా! ఆయుర్దాయం వల్లా, ఆరోగ్యం వల్లా, ఐశ్వర్యం వల్లా సిద్ధించేది ఏమిటి? ఆనందం. ఆయుర్దాయం పెరిగితే ఆనందం. ఆరోగ్యంగా ఉంటే ఆనందం. ఐశ్వర్యం లభిస్తే ఆనందం. ఇవన్నీ కూడా పర్యవసించేది ఆనందంలోనే! అవునా?”

"ఔను గురువుగారూ.”.

"ఆనందం అనేది పరమాత్మ స్వభావం. పరమాత్మ స్వరూపం. సచ్చిదానంద స్వరూపుడు అంటారాయన్ని. పరమాత్మ స్వభావంగా ఉన్న ఆనందం జీవాత్మకు కూడా అంది రావాలి. నా ఆశీస్సులోని అర్ధం బోధపడింది కదా?”

శిష్యులు ముగ్గురూ అర్థమైనట్టు తలలు ఊపారు.

"ఇవాళ వైశాఖ బహుళ విదియ. ఈ తిథికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటో చెప్పగలరా?" నిగమానంద ప్రశ్నించాడు....................

  • Title :Narada Maharshi
  • Author :Vakkantam Suryanarayanarao
  • Publisher :Jaico Publishing House
  • ISBN :MANIMN6441
  • Binding :Papar Back
  • Published Date :2025
  • Number Of Pages :197
  • Language :Telugu
  • Availability :instock