Logili Books

Novels

Nati

By Attaluri Vijaylakshmi

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Nati
Publisher
Sahiti Prachuranalu
ISBN
MANIMN4471
Binding
Papar back
Published Date
July, 2023
Number Of Pages
232
Language
Telugu
Availability
In Stock
About this book

నటి

మహిళా కళాకారుల వేదిక!

నీలం రంగు వెల్వెట్ బట్టమీద బంగారు రంగు అక్షరాలతో ఉన్న బోర్డు చెరో చేత్తో పట్టుకుని ఎక్కడ పెట్టాలి ఇది అన్నట్టు గుమ్మానికిపైన ఉన్న ఖాళీ స్థలం వైపు చూస్తున్నారు పద్మిని, వసంత.

"పైన వద్దులే అక్కా! పక్కకి పెడదాం" అంది వసంత.

"అదే ఆలోచిస్తున్నాను. మరీ పైకి ఎవరూ చూడరు. ఇలా పట్టుకో గుమ్మానికి కుడిపక్కన పెడదాం. సాధారణంగా అందరి కళ్ళు ఎక్కువగా కుడివైపే చూస్తాయి” అంది .

మేకులున్న చిన్న అట్ట పెట్టె, సుత్తి తీసుకుని ఎత్తైన స్టూలు మీద ఎక్కి మేకు కొట్టసాగింది పద్మిని.

చేతులు నొప్పి పెడుతోంటే, వసంత బోర్డు గోడకానించి పక్కగా పెట్టింది. “ఆ, ఆ పడిపోతావు ఏంటి ఆ సాహసం! ఆడపిల్లవి. కాళ్ళో, చేతులో విరిగితే ఎంత ప్రమాదమో తెలుసా!” గట్టిగా అరుస్తూ వచ్చాడు శివరామ్.

స్టూలు దిగుతూ, అతని దగ్గరగా వచ్చి చేతిలో ఉన్న సుత్తి, మేకులు అతని చేతిలో పెడుతూ “వచ్చావుగా మగాడివి. నువ్వు కొట్టిపెడుదూ” అంది పద్మిని.

"అనుకున్నా ఇలాంటిదేదో ఉంటుందనుకుంటూనే వచ్చా. సర్లే ఇలా ఇవ్వు" అంటూ ఆమె చేతిలోంచి తీసుకుని “నేను స్టూలు ఎక్కాక ఒక్కో మేకు ఇవ్వు. ఇది నేనెక్కడ పట్టుకోను" అంటూ స్టూలు దగ్గరకు నడిచాడు.

శివా ”

వసంత అంది. “శ్రేయోభిలాషులెప్పుడూ ఇలాంటి ఆపత్సమయాల్లోనే వస్తుంటారు

“అంతేలే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు." స్టూలెక్కి మేకివ్వమన్నట్టు పద్మిని వైపు చేయిచాపాడు............

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?