నవసమాజ నిర్మాతలు - స్ఫూర్తిప్రదాతలు!
మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవాలంటే చిన్నవయసు నుంచే స్ఫూర్తిప్రదాతలు, మార్గదర్శకులు, దిశానిర్దేశకులైన వారి జీవిత చరిత్రల గురించి తెలుసుకోవడం, అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం. ఈ పరిజ్ఞానం ముఖ్యంగా విద్యార్థినీ విద్యార్థుల, యువత యొక్క వ్యక్తిత్వ వికాసానికీ, వారిలో నైతిక విలువలు పెంపొందించుకోవడానికీ, తద్వారా రేపటి నవసమాజ నిర్మాతలుగా వారివంతు కృషిచేసేందుకు ఎంతో దోహదపడ్తాయి.
ఎదగడానికి మహాత్ముల జీవిత చరిత్రల జ్ఞానం ఎంతో ఉపయోగపడుతుంది. ఆచార్య కూతాటి వెంకటరెడ్డి గారు “నవసమాజ నిర్మాతలు" అనే ఈ గ్రంథంలో ఎనిమిది మంది మహనీయుల జీవిత విశేషాలను అందించారు. ఆధ్యాత్మికవేత్తయే కాకుండా తమ జీవితాన్ని సమాజ సేవకే అంకితం చేసిన సమతామూర్తి శ్రీమద్రామానుజుల జీవిత విశేషాలతో ఈ గ్రంథం ప్రారంభించారు. ఆధునిక కాలంలోని విశ్లేషకులు వెలిబుచ్చిన అభిప్రాయాలను కూడా తెలియజేశారు. రెండవ వ్యాసంలో శ్రీరాజారామ్మోహన్రాయ్ గారి జీవిత విశేషాలు, సంఘ సంస్కర్తగా వారి కృషి, ఇతర విశేషాలు అందజేశారు. ఆ తరువాతి వ్యాసాల్లో ప్రముఖ సంఘసంస్కర్త శ్రీ జ్యోతీరావ్ పూలే, సామాజిక తత్వవేత్త శ్రీనారాయణగురు వంటి మహనీయుల జీవితాంశాలు, వారి అవిరళ కృషి విస్తృతంగా వివరించారు.................