• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Navagraha StotraMala

Navagraha StotraMala By Sri Voleti Ramanadha Sastri

₹ 108

నవగ్రహ శాంతి పూజలు

(స్తోత్రములు, వ్రతకథలు, జపదానములు, ఏల్నాటి శనిపీడా నివారణోపాయాలు, నిత్యపారాయణకుపయుక్తము)

గ్రహ సంతృప్తికి మార్గాలు

మానవుడు ఎంతటి శక్తిసంపన్నుడైనప్పటికీ అతడు నవగ్రహ ప్రభావము ముందు మోకరిల్లవలసినదే, మానవజీవితము సుఖమయ ముగా గడచిపోవుటకుగాని, దుఃఖమయముగా నడచుటకుగాని, నవగ్రహములే కారణము. కనుక మనము నవగ్రహాలకు ప్రీతిని కలిగించే స్తోత్రములు చేయుటగాని, దానములు గావించుటగాని చేసినచో అవి మనల్ని కరుణించి మనపై తమ కృపాకటాక్ష వీక్షణములను ప్రసరింపచేయగలవు.

మనపాలిట ఏఏగ్రహాలు ప్రస్తుతం అనుగ్రహంతో ఉన్నాయో ఏఏ గ్రహాలు అశుభదృష్టిని ప్రసరించుచున్నవో ముందుగా తెలిసికొని చెడు స్థాన మందున్న గ్రహాలను ఎక్కువ పూజలతో సంతృప్తి పరచుట మనవిధి, మన కర్తవ్యము.

రోజులు బాగులేవని, చిక్కులు కలుగుచున్నవని చాలామంది తరచు వాపోవుచుండుట మనము వినుచుందుము. ఈ విధముగా రోజులు బాగులేక పోవుటకు నవగ్రహములే కారణమైనందున చిక్కులు తొలగించుకొనుటకు నవగ్రహశాంతి పూజలు జరిగించుకొనుటకు పరమౌషధమువంటిదని తెలియ వలసియున్నది. మనము మనపూర్వజన్మములో గావించినసుకృత, దుష్కృత ములననుసరించి దైవప్రేర ణచే నవగ్రహములు ఫలితములిచ్చు చుండును.

గ్రహస్థితిని తెలిసికొనుట

ప్రతివారు తాము జన్మించిన నక్షత్రాన్నిబట్టిగాని, లేక నామనక్షత్రాన్ని బట్టిగాని గోచారాన్ని బట్టిగాని తెలిసికొనవచ్చును. గోచారం అంటే గ్రహ ములు సంచరించు విధానమని అర్ధము దీనిని గురించి సంపూర్ణ విషయాలు నేను వ్రాసిన జ్యోతిష మర్మబోధిని అను పెద్దపుస్తకములో (పదవ అధ్యాయ ములో) గాని మీరు చూడ వచ్చును..................

  • Title :Navagraha StotraMala
  • Author :Sri Voleti Ramanadha Sastri
  • Publisher :Mohan Publications
  • ISBN :MANIMN4800
  • Binding :Papar back
  • Published Date :2023
  • Number Of Pages :128
  • Language :Telugu
  • Availability :instock