నవ్వుల మాంత్రికుడు రమణారెడ్డి
రడుగుల పొడవు. బక్క పలుచని శరీరం, క్షణాల్లో మారిపోయే ఆహావభావ విన్యాసం. శరీరాన్ని రబ్బరు బంతిలా తిప్పడం. పాత్ర ఏదైనా అందులో నవ్వుల నాట్లు వేయడం. పాత్రను తనకు అను గుణంగా మలచుకుని పరకాయ ప్రవేశం చేయడం, పాత్ర ఏదైనా నెల్లూరు యాసకు పట్టాభిషేకం చేయగల నవ్వుల ఎవరెడీ - రమణారెడ్డి.
రమణారెడ్డి హాస్యంలో వెకిలితనం ఉండదు. ఆయన పాత్రలు సున్నితంగా ఉండి జ్ఞాపకాల్లో వెన్నాడుతూనే ఉంటాయి. చిరకాలం గుర్తుండి పోతాయి. ఆయన లోకం వీడి ఐదు దశాబ్దాలు దాటినా ఇప్పటికీ ఆయన పాత్రలు గుర్తొస్తే సన్నని చిరునవ్వు పెదవులపై కదలాడుతుంది. ఆయన నటన ఒక్కో చిత్రానికి ఒక్కోలా మారుతూ ఉంటుంది. పాత్ర వైవిధ్యం ఆయనకు కొట్టిన పిండి. ఒక పాత్రకు మరొక పాత్రకు పోలికే ఉండదు. అరుదైన నటనను ప్రదర్శించే రమణారెడ్డి హాస్యంలో అగ్రగణ్యుడు. ఆయన హాస్యం తీయని మకరందం. అది ఎంతచూసినా ఇంకా చూడాలని అనిపిస్తుంది. సీరియస్ పాత్రల్లోనూ హాస్యాన్ని చూపించగల దిట్ట రమణారెడ్డి. ఏ పాత్రనైనా సవాలుగా తీసుకుని జీవించగల అరుదైన నటుడు. ఆయన ఏ పాత్రలోనైనా ఇట్టే ఇమిడి పోగలడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆ పాత్రకు జీవం పోయగలడు. వయసుకు మించిన పాత్రలు వేసినా ఎక్కడా కుర్రతనం కనిపించలేదు. నిజంగానే ఆయన వయసు పెద్దదని అనిపించేలా కనిపించాడు. సన్నగా రివటలా ఉండే ఆయనను చూస్తేనే ప్రేక్షకులు ఫక్కున నవ్వారు. అందుకే రమణారెడ్డి ఎంతమంది హాస్యనటులు ఉన్నా తనదైన గొప్పదనాన్ని నిలుపుకున్నారు. తనదైన శైలితో ప్రేక్షకులను అలరించారు. విలనీతో హాస్యాన్ని మేళవించి శభాష్ అనిపించుకున్నారు. కళ్లతో కూడా కోటి భావాలు పలికించగలనని ఒప్పించారు. మహా నటుడు ఎస్వీఆర్, సావిత్రిలతో పాటు కళ్లతో హావభావ విన్యాసం చేయగలనని నిరూపించిన దృశ్యాలు ఎన్నో. సినిమా స్వర్ణయుగంలో రమణారెడ్డి....................