దేశమంతా నక్సల్బరీ వెలుగు
ఈ మాట అతిశయోక్తి కాదు. అలంకారికం కాదు. నక్సల్బరీ ఒక ఊరు కాదు అనే పుస్తకాన్ని సుమారు రెండు దశాబ్దాల కింద అఖిల భారత విప్లవ విద్యార్థి సమాఖ్య అచ్చేసింది. ఆ రోజుల్లో విప్లవంలోకి వచ్చిన యువతరానికి, విద్యార్థులకు ఆ పుస్తకం గొప్ప ప్రేరణ. అయితే, అప్పటికి నక్సల్బరీ దేశమంతా అనగలిగే పరిస్థితి లేదు. వాస్తవానికి నక్సల్బరీ ఎప్పుడూ ఒక ఊరు కాదు. ఒక ప్రతీక కాదు. ఒక రాజకీయ పంథా. అందువల్లే దేశవ్యాప్తమైంది. ఆ పుస్తకానికంటే సాధికార రచన సుమంతా బెనర్జీ రాసిన నక్సల్బరీ వెలుగులో.
ఇది 1980లో ఇంగ్లీషులోనూ, 1982లో తెలుగులోనూ వచ్చింది. హైదరాబాదులోని సామ్యవాద సాహితి అనే సంస్థ అచ్చేసింది. కృష్ణమూర్తి అనువాదం చేశారు. మూడు దశాబ్దాల తర్వాత ఈ తరం పాఠకుల కోసం, విప్లవాభిమానుల కోసం విరసం పునర్ముద్రిస్తోంది. నక్సల్బరీ పంథా దేశ వ్యాప్త ఐక్య విప్లవోద్యమంగా పురోగమిస్తున్న తరుణంలో ఉద్యమ ప్రారంభదశను తెలుసుకోడానికి ఈ పుస్తకం గొప్పగా పనికి వస్తుంది. అందువల్ల అప్పట్లో ఈ పుస్తక రచనకు ఉన్నట్లే, ఇవాళ పునర్ముద్రణకు కూడా విప్లవోద్యమ వికాస చరిత్రలో ప్రాధాన్యత ఉంది. ఈ దృష్ట్యా మూడు వైపుల నుంచి ఈ పుస్తకాన్ని పరిశీలించవచ్చు. 1. ఈ పుస్తకంలోని పరిశీలనా చట్రం, 2. ఆనాటి ఉద్యమం, ఈ రచన ఆ తరం మీద వేసిన ప్రభావం, 3. ఈ రచనలో లేదా ఆనాటి ఉద్యమంలోని మౌలిక భావనలు, పోరాట నిర్మాణ సన్నాహాలు, ఈ నలభై ఏళ్లలో సాధించిన ప్రగతి.
***
నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాల మీద ఉద్యమ నిర్మాణం నుంచి సాధికార విశ్లేషణ రచనలు రానట్టే. బయటి నుంచి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. అయితే ఉద్యమాల మౌలిక పంథాను గుర్తించడంలోనే లోపం ఉన్నప్పుడు ఇలాంటి ప్రయత్నాలు అరకొరగా...............