• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Naxalism- Naakem Nerpindi?

Naxalism- Naakem Nerpindi? By G Ramulu

₹ 200

స్పందన

రంగనాయకమ్మ

ప్రముఖ రచయిత్రి

రాములు గారికి,

మీరు రాసిన, ‘నక్సలిజం నాకేం నేర్పింది?' పుస్తకాన్ని చదవడం ఇప్పటికి అయింది. చదివాక, నా అభిప్రాయం రాస్తున్నాను. ఒక్క వాక్యంలో చెప్పాలంటే, 'ఈ పుస్తకం రాసి మీరు చాలా మంచి పని చేశారు.’

చదువుతున్నప్పుడు, అండర్ లైన్లూ, నిలువు గీతలూ, పెట్టుకున్నవాటిని చూసుకుంటూ, నాలుగు మాటలు రాస్తున్నాను. కొన్ని ముఖ్యమైన విషయాల్ని మరిచిపోయానేమో?

తెలంగాణాలో 60 ఏళ్ళ కిందట, గ్రామాల్లో దళిత కుటుంబాల పరిస్థితి ఎలా వుండేదో తెలిసింది. చిన్నతనంలో, మీరు గానీ, మీ నాన్న గానీ కులం కారణంగా పన అవమానాలూ, అవీ, మీరు రాసిన పద్ధతి కదిలించేదిగా వుంది. 'ఆకలి కన్నా, కులం తాలూకూ అవమానం చేసిన గాయాలే ఎక్కువ' అని మీరు రాసింది చదివి చాలా బాధేసింది. దళితుల్లో అలాంటి బాధలు పడ్డవారు ఎందరో కదా? కానీ, బాధలూ, అవమానాలూ అనుభవించిన వాళ్ళు, 60 ఏళ్ళ తర్వాత, మీలాగా వాటిని గుర్తుపెట్టుకుని, రాయగలగడం అందరికీ సాధ్యం కాదేమో! చాలా చిన్నప్పుడు, ఒక పాఠంలో, 'చండాలుడు' అనే పదం వచ్చినప్పుడు, 'చండాలుడు అంటే ఎవర'ని? దళితుడు కాని ఒక పిల్లవాడు అడిగితే, ఆ టీచరు మిమ్మల్ని లేవమని చెప్పి, 'వీళ్ళే' అని అన్న సంఘటన, మీ నాన్నని...................

  • Title :Naxalism- Naakem Nerpindi?
  • Author :G Ramulu
  • Publisher :Telangana Publications
  • ISBN :MANIMN6494
  • Binding :Papar back
  • Published Date :Sep, 2024
  • Number Of Pages :165
  • Language :Telugu
  • Availability :instock