నీ మౌనాన్ని గమనించి
చట్టుక్కున రాలిపోయాయి మొగ్గలు
నీ సిగసోయగానికి
కొయ్యబారాయి మబ్బులు
- మాలార్
తపాలా బంట్రోతూ!
ఆమెను చూశాకా ఏమిటి నీ జవాబు?
ఎలా ఉంటదో ఉహించు
ఆమె నుంచి వచ్చే జాబు
- కమార్ బదాయునీ
నవ్వుతున్న పువ్వుల్ని చూస్తే
నువ్వే గుర్తుకొచ్చావు
ఏ గాయాలు ఎలా విలపించాయో
నా హృదయాన్ని అడగవూ !
ఆదిల్ మన్సూర్
ఈ హృదయం నన్ను
ఆమె వీధిలోకి తీసుకెళ్లింది
ఇక మరింతగా
నన్ను బుగ్గిపాలు చేసింది
- మీర్ తాకీ మీర్