• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Ne Silpivi Nuvve

Ne Silpivi Nuvve By Vadrevu Chinaveerabhadrudu

₹ 135

తొలిమాట

శరత్కాలపు అపరాష్ట్రం, దూరంగా రోడ్డు పక్క నిండుగా విరబూసిన కోవిదార వృక్షం. లేత ఎరుపు పూల గుత్తులమీద తూనీగలు. ఆ బహీనియా పరిమళం మేడలూ, మిద్దెలూ దాటి కిటికీలోంచి నా మీద ప్రసరిస్తూ ముంచెత్తుతూ ఉన్నది. ఆ సుకోమలమైన సౌరభం నన్ను తాకుతున్నదని నాకు తెలుస్తున్నందుకు నాకెంతో సంతోషంగా అనిపించింది. నువ్వు దేనిలోనూ కూరుకుపోలేదనీ, పూలగాలి నిన్ను పలకరిస్తే దోసిలిపట్టి నిలబడటానికి సంసిద్ధంగా ఉన్నావని తెలియడంలో గొప్ప అస్తిత్వాదం ఉంది.

ఇన్నేళ్ళ ఉద్యోగ జీవితం నన్ను పూర్తిగా మొద్దుపరచలేదని అర్థమవుతున్నది. మార్కస్ అరీలియస్ ఇలా రాసుకున్నాడు (మెడిటేషన్స్, 6:30):

వాళ్ళు నిన్నొక సీజరుగా మార్చకుండా జాగ్రత్తపడు. నీ దుస్తులకి రాజలాంఛనాలు తగిలించకుండా చూసుకో. నిరాడంబరంగా, మంచిగా, నిర్మలంగా, గంభీరంగా, ఎట్లాంటి నటనలూ లేకుండా మసలుకో. న్యాయానికి మిత్రుడిగా, దేవతలకి విధేయుడిగా, దయగా, అనురాగపూర్వకంగా ఉండటానికి ప్రయత్నించు. నువ్వు చేసే పనులు న్నిటిలోనూ సాహసవంతుడిగా ఉండు. నిన్ను తత్త్వశాస్త్రం ఎటువంటి మనిషిగా రూపొందించాలనుకున్నదో అటువంటి మనిషివి కావడానికి ప్రయత్నించు. దేవుళ్ళని ప్రార్థించు, మనుషులకి సాయం చెయ్యి............................

  • Title :Ne Silpivi Nuvve
  • Author :Vadrevu Chinaveerabhadrudu
  • Publisher :Analpa Book Company
  • ISBN :MANIMN6005
  • Binding :Papar Back
  • Published Date :2025
  • Number Of Pages :122
  • Language :Telugu
  • Availability :instock